శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వరద నీటిలో కోమర్రు

1 గంట క్రితం

Komarru in floodwaters
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 02:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమ గోదావరి) : వరుస తుఫాను వలన ఎనదుర్రు కాలవ ఉద్రిక్తంగా మారి కోమర్రు గ్రామంలోకి వరద నీరు రావటంతో గ్రామంలో వీధులన్ని జలమయంలో మునిగిపోయాయి గణపవరం మండలం శివారు గ్రామాల్లో రెండువేల జనాబా ఉన్నారు. ఎనమదుర్రుకాలవ చెరువులో గ్రామం ఉండటం వలన వర్షం పడితే మునకలో గ్రామం ఉటుంది. ఇప్పటికే కోమర్రునుండి ఇతరగ్రామాలకు వెళ్ళడానికి రహదారులు మునిగి పోవటంతో రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీళ్ళు మంచినీళ్ళచెరువులోకి వెళ్ళటంవలన ఆ నీళ్ళు తాగలేక స్థానికులు మంచినీళ్ళు కోసం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్తిలి వెళ్ళి మంచినీళ్ళను తెచ్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామంలో ప్రజలకి తాగునీరు నిత్యావసర వస్తువులు అందించాలని కోరుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్