ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : నరసాపురం-మత్స్యపురి ప్రధాన రహదారిపై కొప్పర్రు గ్రామంలో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై భారీగా నీరు చేరడంతో ఈ మార్గంలో ప్రయాణించే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, రోడ్డు గుంతలమయంగా మారడంతో నీరు బయటకు పోయే మార్గం లేక రోడ్డుపైనే నిలిచిపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులు నియంత్రణ కోల్పోయి ప్రమాదాల బారినపడుతున్నారు. మోకాళ్ళ లోతు నీటిలో ప్రయాణించలేక వాహనాలు మధ్యలోనే ఆగిపోతుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. స్థానిక గ్రామస్థులు, పాదచారులు కనీసం నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించాలని, అలాగే ఈ సమస్య కు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
నరసాపురం-మత్స్యపురి రహదారిపై నిలిచిన నీరు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 06, 2026, 02:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)