ముంబైలో ఐద్వా భారీ ర్యాలీ
ముంబై : మహారాష్ట్రలో 'లడ్కీ బహిన్ యోజన' పథకానికి అర్హులైన మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని ప్రతి నెలా అందించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు బిజెపి, శివసేన (షిండే) ప్రభుత్వం ప్రారంభించిన లడ్కీ బహిన్ యోజన పథకాన్ని ఫలితాల తరువాత నిలిపివేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలందరికీ ప్రతి నెలా ఆర్థిక సహాయాన్ని తిరిగి అందించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ముంబైలో భారీ నిరసన ప్రదర్శన (మహామోర్చా) నిర్వహించింది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ఈ సభలో ఐద్వా ఉపాధ్యక్షులు మరియం ధావలే, సీనియర్ నాయకులు బృందా కారత్ తదితరులు ప్రసంగించారు.







కామెంట్‌లు (0)