గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 14మందిపై అభియోగాలు

20 నిమిషాల క్రితం

neet .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నీట్‌-యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులైన 14మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. పూణేకు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు రసాయన శాస్త్రానికి ప్రహ్లాద్ విఠల్‌రావు కులకర్ణి(రసాయనశాస్త్రం),జంతుశాస్త్రం, వృక్షశాస్త్రానికి మనీషా గురునాథ్ మంధారే(జంతుశాస్త్రం,వృక్ష‍శాస్త్రం), మనీషా సంజయ్ హవల్దార్‌తో (భౌతికశాస్త్రం) సహా, నిందితులందరిపై అధికారికంగా నవంబర్‌ 21న అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టి, 25న విచారణ ప్రారంభించనున్నట్లు బుధవారం తెలిపింది. మోసం,నేరపూరిత కుట్ర,పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ చట్ట ఉల్లంఘనతో పాటు కాపీరైట్‌ చట్టం కింద అభియోగాలు నమోదు చేసేందుకు తగిన ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. మంధారే,కులకర్ణి,హవల్దార్‌లు తాముఎన్‌టిఎ కింద నిర్వహించే ఎటువంటి ప్రవేశ పరీక్ష‍ల కోచింగ్‌లోనూ ప్రత్యక్ష‍ంగా లేదా పరోక్ష‍ంగా పాల్గొనలేదని పేర్కొంటూ గోప్యతా ధృవీకరణ పత్రంపై సంతకాలు చేసినట్లు సిబిఐ చార్జిషీట్‌లో పేర్కొంది. అయినప్పటికీ, వీరు నీట్‌ పరీక్ష‍కు ముందు అభ్యర్థుల కోసం తరగతులు నిర్వహించారని, ప్రశ్నాపత్రాల పంపిణీ చేశారని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్