సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

1 గంట క్రితం

air poll
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 10:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 'చాలా పేలవమైన' స్థాయికి పడిపోయిన గాలి నాణ్యత

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి పెరిగింది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 307గా నమోదైంది. దీంతో గాలి నాణ్యత 'చాలా పేలవమైన' స్థాయికి చేరింది. ఇండియా గేట్, జనపథ్ ప్రాంతాల్లో ఏక్యూఐ 335గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వెల్లడించింది. ఢిల్లీలోని 58 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల్లో 37 కేంద్రాలు చాలా పేలవమైన గాలి నాణ్యతను నమోదు చేశాయి. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్‌పురిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఏక్యూఐ 417కు చేరింది. మరోవైపు ఢిల్లీ పొరుగు ప్రాంతాల్లోనూ కాలుష్యం పెరిగింది. నోయిడాలో ఏక్యూఐ 308గా, గ్రేటర్ నోయిడాలో 267గా, ఘజియాబాద్‌లో 276గా నమోదైంది. గురుగ్రామ్‌లో 225, ఫరీదాబాద్‌లో 118గా ఉంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ గాలి నాణ్యతలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఏక్యూఐ 301 నుంచి 400 మధ్య ఉంటే చాలా పేలవమైన స్థాయిగా పరిగణిస్తారు. 401 దాటితే తీవ్ర కాలుష్య స్థాయిగా వర్గీకరిస్తారు. గాలి నాణ్యత మరింత దిగజారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు బయట ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్