సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌కు చేరుకున్న ‘ఇండియా బ్లాక్‌’ నేతలు

1 గంట క్రితం

rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నిరసన ప్రదర్శనలో భాగంగా ఇండియా బ్లాక్‌ నేతలు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌కు చేరుకున్నారు. ప్రతిపక్ష‍ాల ఐక్యతను ప్రదర్శిస్తూ, ఎంపిల నేతృత్వంలో వారంతా సోమవారం ఢిల్లీ వీధుల గుండా భారీ ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష‍ుడు మల్లికార్జున్‌ ఖర్గే, పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌ గాంధీ మాట్లాడారు. ‘ఓట్ల చోరీ’కి వ్యతిరేఏకంగా సుప్రీంకోర్టుకు సాగుతున్న ఇండియా బ్లాక్‌ ర్యాలీలో పౌరులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆదేశాల మేరకు ఇండియా బ్లాక్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి సిద్ధమవతుందని అన్నారు. ‘చలో ఢిల్లీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియా ఎక్స్‌లో రాహుల్ గాంధీ ఒక పోస్ట్‌ చేశారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను పరిరక్ష‍ించే లక్ష్యంతో జరిగే నిరసన ప్రదర్శనలో పాల్గొనడానికి సెంట్రల్‌ ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌కు ప్రజలు తరలిరావాలని పేర్కొన్నారు. తాము సిజెఐకి లేఖ రాశామని, పిటిషన్‌ దాఖలు చేయాలని ఆదేశించారని అన్నారఉ . ఇప్పుడు ఓట్ట చోరీ కి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్‌ సుప్రీంకోర్టుకు ర్యాలీ చేపడుతుందని అన్నారు. అనంతరం పిటిషన్‌ దాఖలు చేస్తామని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్