ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంజాబ్‌లో ఘోర బస్సు ప్రమాదం - ముగ్గురు మృతి

12 నవంబర్, 2026

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 09:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 25 మందికి గాయాలు

పంజాబ్‌: పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సంగ్రూర్ నుంచి ధూరి మీదుగా చండీగఢ్‌కు వెళ్తున్న బస్సు ఓవర్‌బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి కందకంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు సహా ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 నుంచి 25 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే సమీపంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. బస్సు ఆలస్యంగా నడుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్ మెహర్ సింగ్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్