బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమందుల ధరల నియంత్రణ పట్టదా?

15 గంటల క్రితం

మందుల ధరల నియంత్రణ పట్టదా?
- మొత్తం వ్యవస్థ ఫార్మా కంపెనీల కోసమే పనిచేస్తోందా? 
- కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 10:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మొత్తం వ్యవస్థ ఫార్మా కంపెనీల కోసమే పనిచేస్తోందా?

  • కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ : దేశంలో ఔషదాల ధరలపై నియంత్రణం లోపించడం, గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌‌పి) కంటే అధికంగా రిటైల్‌‌గా విక్రయిస్తుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఫార్మా కంపెనీల ప్రయోజనాల కోసమే ఎందుకు పనిచేయాల్సివస్తోంది? అంటూ నిలదీసి మోడీ సర్కార్‌కు మొట్టికాయలు వేసింది. ఔషధాల ఎంఆర్‌పికి, రిటైలర్లు కొనుగోలు చేసే ధర మధ్య భారీ వ్యత్యాసం ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మందుల ధరల నియంత్రణకు బాధ్యత వహించే నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పిపిఎ) కూడా పూర్తిగా నిర్వీర్యమైన సంస్థలా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ చేపట్టింది. మందుల ఎంఆర్‌పికి, రిటైలర్లకు వాటిని విక్రయించే ధరకు మధ్య ఉన్న భారీ తేడాను ప్రస్తావిస్తూ, ఇలాంటి పరిస్థితి ప్రభుత్వ పర్యవేక్షణలోనే కొనసాగుతోందని పేర్కొంది. ఔషధ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చేలా మొత్తం వ్యవస్థ ఎందుకు పనిచేస్తోందని ప్రశ్నించింది. ధరల వ్యత్యాసాన్ని ఇలాగే నియంత్రణ లేకుండా కొనసాగనివ్వాలా? అని నిలదీసింది. ఈ పరిస్థితి ప్రభుత్వ కళ్ల ముందే జరుగుతోందని వ్యాఖ్యానించింది. మందుల ధరల నిర్ణయానికి సంబంధించిన అంశాలపై దాఖలైన రెండు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మందుల ధరలు తక్కువగానే ఉన్నాయంటూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చునేలా కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. దేశంలో మందుల ధరలు ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని, ప్రభుత్వ విధానం మొత్తం ఔషధ రంగ వ్యవస్థను నియంత్రించడం కాదని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్