గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ; ఒక్కసారిగా రూ.10 వడ్డన

2 గంటల క్రితం

సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ; ఒక్కసారిగా రూ.10 వడ్డన
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ సిగరెట్ తయారీ సంస్థ ఐటీసీ (ITC) మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తమ ప్రముఖ బ్రాండ్ అయిన 'గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం' (Gold Flake Premium) సిగరెట్ల ధరలను కంపెనీ మళ్లీ పెంచింది. తాజా పెంపుతో 10 సిగరెట్లు ఉండే ఒక ప్యాకెట్ ధర రూ. 125 నుంచి రూ. 135కి చేరింది.


ఒక్కో ప్యాకెట్‌పై ఏకంగా రూ. 10 మేర ధరను పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. 60 నుంచి 70 మిల్లీమీటర్ల పొడవు ఉండే రెగ్యులర్-సైజ్ ఫిల్టర్ టిప్డ్ సిగరెట్లకు ఈ కొత్త గరిష్ట చిల్లర ధర (MRP) వర్తిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 సంవత్సరంలో ఐటీసీ ఈ బ్రాండ్ ధరలను పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం.


గత జూన్ నెలలో రూ. 115గా ఉన్న ఈ ప్యాకెట్ ధరను రూ. 125కు పెంచారు. తాజాగా మరో రూ. 10 అదనంగా పెరగడంతో, జూన్ నాటి ధరలతో పోలిస్తే ఇప్పటివరకు ఒక్కో ప్యాకెట్‌పై మొత్తం రూ. 20 (దాదాపు 17.4 శాతం) మేర భారం పడినట్లయింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్