బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జార్ఖండ్‌లో 44 రకాల పరీక్షలు రద్దు

1 గంట క్రితం

jharkgand
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 10:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- జాబితా విడుదల

రాంచీ: పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో రద్దు చేసిన 44 రకాల పరీక్షల జాబితాను జార్ఖండ్ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక ప్రకటన చేశారు. నిరసనకారుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన జేఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షతో పాటు.. కాంట్రాక్ట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన అన్ని పరీక్షలు, వాటి ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దైన పరీక్షల జాబితాలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ కలెక్టర్, డెంటల్ డాక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, సివిల్ జడ్జి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ తదితర పోస్టులకు సంబంధించిన పరీక్షలు ఉన్నాయి.

2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), కాంట్రాక్ట్ ఏజెన్సీ టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన పరీక్షలను రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఎనిమిది వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. పరీక్షా వ్యవస్థలో సంస్కరణల కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కౌశల్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండు నెలల్లోగా తన నివేదికను సమర్పించనుంది. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలకు సంబంధించిన కేసులను వేగంగా విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అలాగే పరీక్షా బోర్డుల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక అంతర్గత నిఘా విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్