మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యూపీలో ఆగి ఉన్న స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. నలుగురు విద్యార్థుల దుర్మరణం

1 గంట క్రితం

యూపీలో ఆగి ఉన్న స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. నలుగురు విద్యార్థుల దుర్మరణం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 10:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కన్నౌజ్ (ఉత్తరప్రదేశ్) :

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న పాఠశాల బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌశాంబిలోని ఓరియంటల్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు, సిబ్బంది కలిసి ఆగ్రాలోని తాజ్‌మహల్ విహారయాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని మొత్తం 50 మందితో తిరిగి వస్తుండగా, మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో థాతియా సమీపంలో ఎక్స్‌ప్రెస్‌వే పక్కన (షోల్డర్ లేన్‌లో) బస్సును నిలిపారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సు ఆపిన సమయంలో, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన లారీ బస్సును బలంగా ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఉత్తరప్రదేశ్ ఎక్స్‌ప్రెస్‌వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూపీఈఐడీఏ) సిబ్బంది, స్థానిక ప్రయాణికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసి అంబులెన్సుల ద్వారా సమీపంలోని వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.


ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు నలుగురు విద్యార్థులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారని కన్నౌజ్ ఎస్పీ వినోద్ కుమార్ వెల్లడించారు. గాయపడిన 32 మందిలో 24 మంది విద్యార్థులు, 8 మంది పాఠశాల సిబ్బంది ఉన్నారని, వీరికి వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్