మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిరసన స్థలాలను నిరవధికంగా ఆక్రమించుకోరాదు : సుప్రీంకోర్టు

2 గంటల క్రితం

sc-3
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 04:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : నిరసనల కోసం కేటాయించిన స్థలాలను ఏ వ్యక్తి, సంస్థ లేదా సమూహం నిరవధికంగా ఆక్రమించుకోవడానికి హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే ప్రదేశంలో ఇతరులకు కూడా తమ సమస్యలపై నిరసన తెలిపే రాజ్యాంగ హక్కు ఉందని పేర్కొంది. కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో జులైలో ఢిల్లీలో జరిగిన నిరసనలపై పోలీసుల చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. నిరసనలకు కాలపరిమితి ఉండాలని, ఒక వర్గానికి అనుమతి ఇచ్చినంత మాత్రాన ఆ స్థలాన్ని శాశ్వతంగా ఆక్రమించుకునే హక్కు కల్పించినట్లు కాదని తెలిపింది. మరోవైపు, నిరసనల వల్ల వ్యాపారాలు, ప్రజల జీవనోపాధికి నష్టం కలుగుతోందంటూ ఢిల్లీ వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్లను కూడా కోర్టు విచారించింది. జంతర్‌మంతర్‌ను నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడంపై, నిరసనకారులపై ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వినియోగం, గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలపైనా విచారణ కొనసాగించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్