చండీగఢ్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్‌లో ‘ఆపరేషన్ లోటస్’ ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బిజెపి యత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ముగ్గురు ఆప్ ఎమ్మెల్యేలు కున్వర్ విజయ్‌ప్రతాప్ సింగ్, హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా, చేతన్ సింగ్ జౌరామజ్రా సోమవారం బిజెపిలో చేరారు. 2027 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆప్ 40 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే సమానా నియోజకవర్గ ఎమ్మెల్యే చేతన్‌సింగ్, సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్‌లు ఆదివారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ సోమవారం ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఇటీవల ఆయనను పార్టీ సస్పెండ్ చేయడం గమనార్హం.
పంజాబ్‌లో బిజెపి ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందని, ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటోందని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకుంటామని ఆప్ పంజాబ్ చీఫ్ ప్రతినిధి, ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ధలివాల్ పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)