హర్యానా : 6 నెలల పసికందు పై పెంపుడు కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన హర్యానాలో జరిగింది. తల్లి బిడ్డను ఎత్తుకుని ఇంటిముందు ఆడిస్తుండగా ఇంట్లో ఉన్న కుక్క ఒక్కసారిగా బయటకు వచ్చింది. చిన్నారి తల్లి మరొకరితో మాట్లాడుతున్న సమయంలో ... కుక్క ఒక్కసారిగా ఆమెపైకి దూకడంతో తల్లి కిందపడిపోయింది. కిందపడిన వెంటనే తల్లి చేతినుండి చిన్నారి సైతం పడిపోయింది. కుక్క చిన్నారిని నోటితో పట్టి లాగుతూ తీవ్రంగా గాయపరిచింది. తల్లి, చుట్టుపక్కలవారు కలిసి పాపను కుక్క నుంచి విడిపించడానికి ప్రయత్నించినప్పటికీ.. అది వదల్లేదు. నోట కరుచుకుని ఈడ్చుకెళ్లడానికి ప్రయత్నించింది. దీంతో స్థానికులు కుక్కను కర్రతో కొట్టారు. ఎట్టకేలకు చిన్నారిని కుక్క నుంచి విడిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పెంపుడు కుక్క దాడి ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. పెంపుడు జంతువులను పెంచుకునేవారు వాటి ప్రవర్తన గమణించాలని, తేడాగా కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
6 నెలల పసికందు పై పెంపుడు కుక్క దాడి
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 10:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)