సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆలయ ఆస్తులపై పూజారులకు హక్కులు లేవు

7 గంటల క్రితం

ఆలయ ఆస్తులపై పూజారులకు హక్కులు లేవు
- కేరళ హైకోర్టు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 10:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కేరళ హైకోర్టు

కొచ్చి: ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే అధికారం తంత్రులకు ఉన్నప్పటికీ, దేవుడి ఆస్తిపై వారు యాజమాన్య హక్కును కోరలేరని, వజివాహనాలతో సహా లోహ వస్తువులను తంత్రుల (ప్రధాన పూజారులు) వ్యక్తిగత ఆస్తిగా క్లెయిమ్ చేయరాదని కేరళ హైకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దైవానికి సమర్పించిన ఆస్తులు దైవానికే చెందుతాయని, ధార్మిక పూజలు నిర్వహించడం వల్ల అటువంటి ఆస్తులపై తంత్రులకు ఎలాంటి యాజమాన్య హక్కులు లభించవని జస్టిస్‌ కెవి జయకుమార్‌, జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ పేర్కొంది. అఖిల తంత్రి ప్రచారక సభ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ న్యాయమూర్తులు రాజా విజయరాఘవన్, కేవీ జయకుమార్లతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. పాత ధ్వజస్తంభాన్ని (కొడిమరం) మార్చినప్పుడు, దానిపై ప్రతిష్ఠించిన వజివాహనం వంటి లోహ వస్తువులను, బహుమతిగా గానీ లేదా సాంప్రదాయ ఆచార హక్కుల కింద గానీ తంత్రికి అప్పగించాలని పిటిషనర్లు వాదించారు. తంత్రసముచ్చయం అనే సాంప్రదాయ గ్రంథం ప్రకారం ఈ ఆచారం గుర్తింపు పొందిందని.. దీనిని నిరోధించే అధికారం దేవస్థానం బోర్డుకు లేదని కూడా వారు వాదించారు. అటువంటి లోహ వస్తువులను దేవస్వం బోర్డు ఆస్తిగా ఉంచుకోవాలని ఆదేశిస్తూ 2012లో దేవస్వం కమిషనర్ జారీ చేసిన సర్క్యులర్ను ఈ పిటిషన్ సవాలు చేసింది. తంత్రుల సంస్థ సమర్పించిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ సర్క్యులర్ జారీ చేయబడిందని బోర్డు కోర్టుకు తెలియజేసింది. ఆలయ పరిపాలనలో ఆచార, మతపరమైన విషయాలపై తంత్రులకు అధికారం ఉన్నప్పటికీ, దేవుడికి చెందిన ఆస్తులు, విలువైన వస్తువులను దేవస్థానం ఆస్తిగా పరిగణనలోకి తీసుకుని.. వాటిని పరిరక్షించి, నిర్వహించాలని కోర్టు స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్