బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యువతుల పట్ల ఢిల్లీ పోలీసుల తీరును ఖండించిన రాహుల్‌గాంధీ

2 గంటల క్రితం

rahul gandhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 02:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఢిల్లీ నిరసనల్లో యువతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై లోక్‌సభ ప్రతిపక్ష‍ నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. యువతులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, వారిని కొట్టారని అన్నారు. బుధవారం ఆయన మీడియాకు వివరించారు. పోలీసులు పదేపదే చెంపపై కొట్టడంతో కేరళకు చెందిన అతిరాకి చెవుడు వచ్చిందని అన్నారు. ఆ చెవిపై దెబ్బ తగలడం వల్లే ఆమెకు ఆ చెవి వినిపించకుండా పోయిందని అన్నారు. ఆమె ఇకపై వినలేదని అన్నారు. గతంలో పోలీసులు దాడిలో ఒక వ్యక్తి కంటి చూపు కోల్పోయాడని అన్నారు. ఆ వ్యక్తి జరిగిన దారుణ ఘటనపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశామని అన్నారు.
అతిరా మాట్లాడుతూ.. తాను ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్నానని అన్నారు. మంగళవారం పోలీసులు తనను అరెస్ట్‌ చేశారని, ఢిల్లీలో మరో ప్రాంతానికి తరలించారని అన్నారు . అయితే బస్సులో మహిళా పోలీసులు ఎవరూ లేరని అన్నారు. దీంతో అదేవిషయాన్ని తాను అడిగానని అన్నారు. ఒకవేళ పోలసులు మహిళలను అరెస్ట్ చేయాలంటే కనీసం ఒక లేడీ పోలీస్‌ అధికారి అయినా ఉండటం తప్పనిసరి. ఆ తర్వాత బస్సు కన్నాట్‌ ప్లేస్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆగిందని, అక్కడ వారు తన చెంపపై పదేపదే కొట్టారని అన్నారు. దీంతో కంటికి గాయమైందని, చెవి దెబ్బ తిందని అన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్