బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే : దీప్కే

16 అక్టోబర్, 2026

Dipke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 11:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మార్చ్‌కు ముందే తనను ఢిల్లీపోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని, జైలు కెళ్లేందుకైనా తాను సిద్ధమేనని కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే ప్రకటించారు. సిజెపి నేతల అరెస్టును నిరసిస్తూ.. నేడు కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) పిలుపునిచ్చిన ‘లెహ్రా దో తిరంగా’ (త్రివర్ణపతాకాన్ని ఎగరవేయండి) మార్చ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాను పోలీసుల నిఘాలో ఉన్నానని, మార్చ్‌కు ముందే తనను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని అన్నారు. త్రివర్ణపతాకాన్ని చేతబూనినందుకు జైలుకు వెళ్లాల్సి వస్తే, అందుకు తాను సిద్ధంగా ఉన్నామని అన్నారు.


ఢిల్లీలో హైటెన్షన్‌ నెలకొంది. మరోవైపు ఢిల్లీని పోలీసులు చుట్టుముట్టారు. ఈ మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. సుమారు 6,000మందికి పైగా పోలీసులు, 220 సిఎపిఎఫ్‌ (కేంద్ర సాయుధ పోలీసు దళాలు )లను మోహరించారు. ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు అమల్లో ఉన్నాయి.


సెంట్రల్ పార్క్ మూసివేత పిటిషన్‌ప విచారణకు సుప్రీం నిరాకరణ
సిజెపి ప్రతిపాదించిన నిరసనకు ముందు సెంట్రల్ పార్క్‌ను మూసివేయాలన్న ఎన్‌డిఎంసి ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్