న్యూఢిల్లీ : గత 12 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం దేశ ప్రజాస్వామ్యానికి, సంస్థలకు, రాజ్యాంగానికి తీవ్ర నష్టం కలిగించిందని కాంగ్రెస్ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారం నుండి వైదొలిగిన తర్వాత కూడా దేశ వ్యవస్థలను తిరిగి ఆరోగ్యకరమైన స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. దీని కోసం రాజకీయ పార్టీలు ఎంతో కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. తన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' విడుదల సందర్భంగా 'జాతీయ మీడియాతో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం దేశ ప్రజలు జరిగిన నష్టాన్ని గుర్తించడం ప్రారంభించారని, వారిలో ఆందోళన పెరుగుతోందని అన్నారు. దేశ రాజకీయ భవిష్యత్తుపై ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తాను నిరాశావాదిని కాదని, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ పార్టీకి, ఇతర ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు లభించలేదని అన్నారు. అన్ని సంస్థలపై, ముఖ్యంగా ఎన్నికల సంఘాన్ని పూర్తిగా గుప్పిట్లో ఉంచుకుందని అన్నారు. అలాగే ప్రధాన మీడియాను నియంత్రించడంతో పాటు ధనబలం, మతాన్ని వాడుకుంటోందని అన్నారు. ఈ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పోరాడుతోందని, పురోగతి సాధిస్తోందని అన్నారు. మోడీ ప్రభుత్వ దాడిని తట్టుకోగల దృఢత్వం కలిగిన ఏకైక పార్టీ ఇదేనని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వేధింపులకు గురయ్యారని అన్నారు. అన్ని జిల్లాలు, గ్రామాల్లోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రాజ్యాంగ విలువల కోసం పోరాడుతూనే ఉన్నారని అన్నారు. అక్రమ మార్గాల ద్వారా ఎన్నికలను మోడీ ప్రభుత్వం దొంగిలిస్తోందని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమాన భావజాలం కలిగిన ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తోందని, తమ మా అవకాశాలు రోజురోజుకూ మెరుగుపడుతున్నాయని ఆమె అన్నారు.
ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం కలిగించిన మోడీ ప్రభుత్వం : సోనియాగాంధీ
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026, 04:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)