గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

షోరూమ్‌ ప్రారంభం కాకముందే బంగారం చోరీ

2 గంటల క్రితం

Tanishq showroom
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 04:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : షోరూమ్‌ ప్రారంభం కాకముందే సుమారు 20 కేజీల బంగారాన్ని దొంగలు దోచుకువెళ్లారు. తమిళనాడులోని మదురై జిల్లాలోని తనిష్క్‌ షోరూమ్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఒక అనుమానితుడు భవనం పై అంతస్తు నుండి లిఫ్ట్ మార్గం ద్వారా షోరూమ్‌లోకి ప్రవేశించినట్లు సిసిటివి ఫుటేజీలో కనిపించడంతో ఈ బంగారం చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో కనిపించడంతో ఈ చోరీ వెలుగులోకి వచ్చింది. చోరీకి గురైన బంగారం పరిమాణం, దాని విలువ ఎంతనేది ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు తెలిపారు. ఈ షోరూమ్‌ ప్రారంభమై పదిరోజులే అయిందని, ఇంకా అధికారికంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగాల్సి వుందని యాజమాన్యం తెలిపింది. షోరూమ్‌ లోపలి పనులు, ఇంటీరియర్‌ వర్క్‌ జరుగుతోందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్