ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయాసిన్ మాలిక్, రషీద్, మరో ఐదుగురిపై విచారణ

13 గంటల క్రితం

Delhi-High-Court-3-1.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మనీలాండరింగ్ కేసులో అభియోగాల నమోదుకు ఢిల్లీ కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసు (పిఎంఎల్‌ఎ)లో, జైలులో ఉన్న వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్, బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్, మరో ఐదుగురిపై విచారణకు న్యూఢిల్లీలోని ఒక కోర్టు ఆదేశించింది. పిఎంఎల్‌ఎ కింద ఏడుగురు నిందితులపై అభియోగాలు నమోదు చేయాలని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ శర్మ ఆదేశించారు. జమ్ముకాశ్మీర్‌లో వేర్పాటువాద కార్యకలాపాల కోసం పాకిస్థాన్ నుండి వివిధ మార్గాల ద్వారా నిందితులు రూ.8.94 కోట్ల ఆదాయాన్ని పొంది, ఉపయోగించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఆరోపించింది. నిందితులలో నిషేధిత జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్‌) ‌నాయకుడు మాలిక్, వేర్పాటువాద నాయకుడు షబీర్ అహ్మద్ షా, బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్, మసరత్ ఆలం, జహూర్ అహ్మద్ షా వటాలి, నవల్ కిషోర్ కపూర్, మెస్సర్స్ ట్రైసన్ ఫార్మ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) నమోదు చేసిన కేసు ఆధారంగా ఇడి మనీలాండరింగ్‌ ఆరోపణలు చేసింది. మాలిక్‌ ‌రూ.3 కోట్లకుపైగా విదేశీ నిధులను అందుకుని, నేర కార్యకలాపాలకు మళ్లించారని ఇడి పేర్కొంది. జైలులో ఉన్న ఎంపీ ఇంజనీర్ రషీద్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్