గురువారం, 12 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కిష్త్వార్‌ అడవుల్లో ఇద్దరు ఎస్‌పీఓల మృతదేహాల గుర్తింపు

6 గంటల క్రితం

Kishtwar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 11:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లాలో ఇద్దరు స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్లు (ఎస్‌పీఓలు) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా దట్టమైన అడవుల్లోకి వెళ్లిన వీరు అదృశ్యమైన మరుసటి రోజు బుల్లెట్‌ గాయాలతో మరణించి కనిపించారు. గురువారం కియార్‌, దచ్చన్‌ ప్రాంతంలో చేపట్టిన విస్తృత గాలింపు చర్యల్లో వారి మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను రాశ్‌పాల్‌ కుమార్‌ (45), బాబీ చంద్‌ (57)గా గుర్తించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరు అధికారులు ఆర్మీకి చెందిన 17 రాష్ట్రీయ రైఫిల్స్‌ బృందంతో కలిసి కిష్త్వార్‌లోని బాస్నన్‌ అటవీ ప్రాంతానికి వెళ్లిన అనంతరం అదృశ్యమయ్యారు. బుధవారం మార్వా సెక్టార్‌లోని టీఓబీ క్యాంప్‌ ధర్నాకు తిరిగి చేరుకోలేదు. వీరు అదృశ్యమైన సమయంలో ఆ ప్రాంతంలో కాల్పుల శబ్దాలు వినిపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొంత సమయం తర్వాత వారి మొబైల్‌ ఫోన్లు కూడా పనిచేయలేదని పేర్కొన్నాయి. జమ్మూ కాశ్మీర్‌ ఎగువ ప్రాంతాల్లో 2020 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో పోలీసులు తాత్కాలిక కార్యాచరణ స్థావరాలను (టెంపరరీ ఆపరేటింగ్‌ బేసెస్‌-టీఓబీలు) ఏర్పాటు చేశారు. ఈ ఇద్దరు ఎస్‌పీఓలు వాటిలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసుల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉగ్రవాదులు సిఆర్‌పిఎఫ్‌ బలగాలపై కాల్పులు జరిపిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలైన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్