సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పంజాబ్‌‌లో 13.6 లక్షల ఓట్లు తొలగింపు

4 గంటల క్రితం

sir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్‌ఐఆర్‌ తరువాత తుది జాబితా ప్రకటన

చండీగఢ్: పంజాబ్‌‌లో నెలల తరబడి సాగిన ఎస్‌ఐఆర్‌ ‌తరువాత ఎట్టకేలకు సోమవారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఎస్‌ఐఆర్‌‌కు ముందుతో పోలిస్తే 13.6 లక్షలకు పైగా ఓటర్లు, అంటే 6.33 శాతం ఓట్లను తొలగించారు. తుది జాబితా ప్రకారం రాష్ర్టంలో 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2,01,00,727 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్‌ఐఆర్‌‌కు ముందు 2,14,61,043 మంది ఓటర్లు ఉన్న సంగతి తెలిసిందే. మరణాలు, శాశ్వత వలసలు, గైర్హాజరైన ఓటర్లు, డూప్లికేట్ ఎంట్రీలు వంటి కారణాలతో ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అయితే, ఆగస్టు 13న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య 1,93,94,435గా ఉంది. తుది జాబితాలో 7,97,263 మంది కొత్త ఓటర్లను నమోదు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి అనిందితా మిత్రా తెలిపారు. 2027 ఫిబ్రవరిలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్‌‌లో ఎస్‌ఐఆర్‌ ‌ప్రక్రియకు మే 14న ఒక నోటిఫికేషన్‌‌ను ఎన్నికల కమిషన్‌ ‌జారీ చేసింది. జూన్ 25న ఎస్‌ఐఆర్‌ లాంఛనంగా ప్రారంభమైంది. ఆగస్టు 13న ముసాయిదా జాబితా విడుదల చేసి, క్లెయిమ్‌లు- అభ్యంతరాలకు సెప్టెంబర్ 12 వరకు గడవు ఇచ్చారు. వీటి పరిషార్కానికి ఈ నెల ఎనిమిది వరకూ సమయం ఇచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్