సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జ్ఞానేశ్‌కుమార్ అప్రూవర్‌గా మారాలి

2 గంటల క్రితం

జ్ఞానేశ్‌కుమార్  అప్రూవర్‌గా మారాలి
- అసలు నేరస్థులను త్వరలో బయటపెడతాం
- రాహుల్‌గాంధీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 12:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అసలు నేరస్థులను త్వరలో బయటపెడతాం

- రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ : ఓట్ల దొంగ‌త‌నంలో భార‌త ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ (సిఇసి) జ్ఞానేశ్‌కుమార్ అప్రూవర్‌గా మారాలని లోక్‌స‌భ‌లో కాంగ్రెస్‌ప‌క్ష నాయకుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఇసి ప్ర‌ధాన నేర‌స్థుడు కాద‌ని, ఆయన రాజీనామా చేసి అప్రూవర్‌గా మారాలన్నారు. సిఇసి వెనుక ఉండి ఈ పని చేయించిన అస‌లు నేర‌స్థుల‌ను బ‌య‌ట‌ప‌ట్ట‌డం కోసం తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు. అప్రూవ‌ర్‌గా మారితే ప్రతిపక్షాలు సిఇసిని క్షమించే అవకాశం కూడా ఉందని రాహుల్‌గాంధీ అన్నారు. అలాగే, సిఇసి జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతాయని, భారీగా భద్రతా బలగాలను మోహరించడం, నిరసనకారులపై అణచివేత చర్యలు చేపట్టడం ద్వారా ప్రభుత్వం ఆయనను కాపాడటానికి ఎలా ప్రయత్నిస్తుందో స్పష్టమవుతోందని అన్నారు. అంతేకాకుండా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అదాని వల్లనే ఆయన అలా చేశారన్నారు. సిఇసి నుండి మెస్సెజ్‌‌లు వస్తున్నాయని, అలాగే, దాదాపు రెండు వందల మంది అధికారులు తనతో టచ్‌‌లో ఉన్నారని రాహుల్‌ ‌గాంధీ తెలిపారు. అయితే, రాజ్యాంగాన్ని పరిరక్షణకు పోరాటం కొనసాగుతుందని రాహుల్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్