సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డిసెంబర్ తొలి వారంలో శీతాకాల సమావేశాలు !

7 గంటల క్రితం

parliament
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 09:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ బలాన్ని ప్రస్తుతమున్న 543 సీట్ల నుంచి గరిష్ఠంగా 850కి విస్తరించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోంది. అయితే మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌కు ముడిపెట్టి బిజెపి ప్రభుత్వం పదేపదే వంచనకు గురిచేస్తోందని విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ అమల్జేయాల్సిందేనని మహిళ సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళనలు కూడా చేపట్టాయి. కానీ బిజెపి మొండిగా వ్యవహరిస్తూ డీలిమిటేషన్‌కు ముడిపెట్టి నెపాన్ని ప్రతిపక్ష‍ాలకు నెట్టివేస్తోంది. డీలిమిటేషన్‌ కారణంగా దక్ష‍ిణాది రాష్ర్టాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలను సైతం బిజెపి పట్టించుకోవడం లేదు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం లభించాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. ప్రస్తుతం సభలో 543 మంది సభ్యులున్నారు. అంటే ఇందులో 361 మంది బిల్లుకు మద్దతు ఇవ్వాల్సివుంటుంది. ప్రస్తుతం మూడు ఖాళీలతో సభలో 540 మంది మాత్రమే సభ్యులున్నారు. ఎన్‌డిఎ కూటమికి 320 స్థానాలు ఉన్నాయి. అందువల్ల బిల్లు ఆమోదం పొందాలంటే ప్రతిపక్ష‍ాలకు చెందిన సభ్యులు కూడా మద్దతు ఇవ్వాల్సివుంటుంది. ఈ నేపథ్యంలో వివిధ మార్గాల్లో మద్దతు కూడగట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ - కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ద్వయం తమదైన రీతిలో వ్యూహాలు పన్నినట్లు కథనాలు వస్తున్నాయి. మరోవైపు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) వంటి ఏకపక్ష‍ నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామాకు ప్రతిపక్ష‍ాలు డిమాండ్‌ చేస్తున్న సంగతి విదితమే. గత సెషన్‌ కూడా ఇదే డిమాండ్‌తో ప్రతిపక్ష‍ాలు సభను స్థంభింబజేశాయి. శీతాకాల సమావేశాల గత సెషన్‌ ఈ ఏడాది ఆగస్టు 13న నిరవధికగా వాయిదా పడగా..94 రోజులుగా ప్రోరాగ్‌గా ఉండిపోయింది. పార్లమెంటు చరిత్రలో ఇదొ రికార్డు. గత రికార్డు 2008లో 87 రోజులు సభ ప్రోరోగ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్