విజయవాడ : సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ముందుగా బివి.రాఘవులు మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అగ్రనేత మోహన్ భగవత్ నిన్న ఉజ్జయినిలో ప్రసంగం చేస్తూ .... భారతదేశానికి లౌకికవాదం అనేది సరిపోదనీ, ధర్మం ప్రాతిపదిక పైనే పరిపాలన జరగాలని.. లౌకికవాదం అనేది ఐరోపా ఇతర దేశాల్లో వచ్చిందనీ, రాజ్యం ఇహలోకం గురించి ఆలోచించాలని, మతం పరలోకం గురించి ఆలోచించాలని వారు లౌకికవాదాన్ని తెచ్చారనీ, మన భారతదేశంలో ఇహలోకం, పరలోకం రెండూ కలిసే ఉంటాయని.. అందుకే మన దేశానికి లౌకికవాదం పనికిరాదని.. ధర్మం ప్రాతిపదిక ఉండాలంటూ ... ప్రసంగించారని తెలిపారు. ఏం ధర్మం పరిపాలన చేయాలి ? మనుధర్మమా, వర్ణ ధర్మమా, లేక ఆశ్రమ ధర్మమా, లేక రాజ్యాంగ ధర్మమా .. ఏం ధర్మం పనిచేయాలని భగవత్ చెప్పారు ? ఆయన స్పష్టతనివ్వలేదని అడిగారు. ఈ దేశంలో ఏ కులం, ఏ మతం ఏదైనా కానీ ఓ రాజ్యాంగం ఉందని, ఆ రాజ్యాంగం దృష్టిలో మనమంతా పౌరులం అని చెప్పారు. ఈ పౌర ధర్మం మాత్రమే పనిచేయాలని సిపిఎం కోరుతుందన్నారు. అనంతరం వి.శ్రీనివాసరావు రాష్ట్రంలోని విశాఖలో పేదలకు ఇళ్ల పట్టాలపై పంపిణీ పై మాట్లాడారు.
CPM LIVE : BV Raghavulu_V Srinivasarao Pressmeet
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)