శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కశింకోటలో 37 ద్విచక్ర వాహనాలు సీజ్

1 గంట క్రితం

carden search.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–కశింకోట (అనకాపల్లి జిల్లా): కశింకోట హౌసింగ్‌ కాలనీ, పూసర్ల వీధిలో శనివారం ఉదయం పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అనకాపల్లి సబ్‌ డివిజన్‌ పోలీస్‌ అధికారి ఇ. శ్రీనివాసులు, కశింకోట సీఐ అల్లూ స్వామినాయుడు ఆధ్వర్యంలో ‘వజ్ర ప్రహర్‌’లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 600 మందిని పోలీసులు విచారించగా, 150 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు, ఇన్సూరెన్స్‌ లేని 37 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అలాగే మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటినీ పరిశీలిస్తూ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ట్రాఫిక్‌ సీఐ నారాయణరావు, టౌన్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌, అనకాపల్లి రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌, ఈగల్‌ సీఐ నారాయణరావు, కశింకోట ఎస్‌ఐ లక్ష్మణరావు, బి. సతీష్‌తో పాటు సుమారు 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్