ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

LIVE - రాష్ట్రంలో కరువు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది : వి.శ్రీనివాసరావు

1 గంట క్రితం

Drought is raging with severe intensity across the state: V. Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కరువు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ .... ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడవు.. పంటలు పండే అవకాశం తక్కువ అని ముందునుండే పర్యావరణ శాస్త్రవేత్తలు, వాతావరణశాఖ అధికారులు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. గత 20 రోజులుగా ఈ విషయమై రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు తీవ్రమైన ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సిపిఎం పార్టీ తరపున ప్రతినిధుల బృందాలు కరువు మండలాల్లో పర్యటించారని వెల్లడించారు. వామపక్షాల ఆధ్వర్యంలో రైతు సంఘాలు ఈ నెల 21 నుండి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల వద్ద ధర్నాలు చేస్తామని ప్రకటించిన తరువాత ఇప్పుడు ప్రభుత్వం నిదానంగా మేల్కొని ... అక్టోబర్ ఒకటి నాటికి కరువు మండలాలను ప్రకటిస్తామని చెప్పిందన్నారు. ఓ వైపు పెట్టుబడిదారుల కోసం దేశదేశాలను తిరుగుతున్నారు కానీ మరోవైపు మన రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను చూడటానికి కూడా వారికి తీరిక లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. వర్షాకాలంలో కూడా మండుటెండలు కాస్తుంటే ... సాగుకు నీరు లేక, పశుగ్రాసం లేక రైతులు నానా అవస్థలుపడుతుంటే ... గత 3 నెలల్లో సిఎం చంద్రబాబు కానీ, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ కానీ, మంత్రి లోకేష్ కానీ ఏ ఒక్కరైనా కరువు మండలాల్లో పర్యటించి రైతులతో, రైతు కూలీలతో మాట్లాడారా ? వారి నష్టాలను కష్టాలను తెలుసుకున్నారా ? అని ప్రశ్నించారు. రైతుల భూముల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అసైన్డ్ భూముల విషయంలో కమిటీ వేసి ఆ తరువాతే జిఒ లు ఇవ్వాలని కోరారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్