బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. స్వర్ణం కోసం శ్రీలంకతో పోరు
ఆసియా క్రీడలు–2026 మహిళల క్రికెట్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీఫైనల్‌లో భారత్ 114 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో స్వర్ణ పతకం కోసం ఫైనల్‌లో శ్రీలంకతో తలపడనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ అజేయ శతకంతో భారత్‌కు భారీ స్కోరు అందించింది. 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్సర్లతో 100 పరుగులు చేసిన షఫాలీ.. అంతర్జాతీయ వైట్‌బాల్ క్రికెట్‌లో తన తొలి సెంచరీని నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ 40 పరుగులు, స్మృతి మంధాన 37 పరుగులు చేశారు. భారతి ఫుల్మాలి 9 పరుగులు చేయగా, కమలిని 3, రిచా ఘోస్ 2 పరుగులు చేశారు.
భారత్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభం నుంచే తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోతూ పరుగులు చేయడంలో విఫలమైంది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 81 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దిలారా ఆక్తర్ 27 పరుగులతో ఆ జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచింది. సుల్తానా ఖాతున్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. మిగాతా బ్యాటర్లలో జువైరియా ఫెర్దౌస్ (0), శోభనా మోస్తరీ(4), నిగర్ సుల్తానా(9), షోర్నా అక్తర్ (5), షర్మిన్ అక్తర్ (10), నహిదా అక్తర్ (4), రబేయా ఖాన్ (0), మరుఫా అక్తర్ (5), శంజిదా అక్తర్ మేఘలా (0) నిరాశపరిచారు. మిగతా బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా సాధించలేకపోవడంతో బంగ్లాదేశ్ ఛేదన పూర్తిగా విఫలమైంది. షఫాలీ వర్మ అద్భుత శతకం, భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో భారత్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పుడు స్వర్ణ పతకం కోసం శ్రీలంకతో కీలక పోరుకు సిద్ధమైంది.







కామెంట్‌లు (0)