భోపాల్: మధ్యప్రదేశ్‌లో రైతులు కనీస మద్దతు ధర కోసం రోడ్డెక్కారు. సమస్యల పరిష్కారం కోసం సంయుక్త కిసాన్ మోర్చా ( ఎస్‌కెఎం)తో పాటు పలు రైతు సంఘాలు భోపాల్ మార్చ్ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే భోపాల్ సరిహద్దు ప్రాంతమైన హోషంగాబాద్ రోడ్డులో మంగళవానం పోలీసులు బారికేడ్‌లు అడ్డుపెట్టి రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆగ్రహించిన అన్నదాతలు అక్కడే భైఠాయించారు.
రైతుల డిమాండ్స్...
మూంగ్ (పెసలు) పంటను 100 శాతం ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
ఎరువుల పంపిణీకి ఉపయోగించే ఇ-టోకెన్ వ్యవస్థను రద్దు చేయాలి.
ఎరువులను తగినంతగా అందుబాటులో ఉంచాలి.
తమ ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించాలి.








కామెంట్‌లు (0)