విజయవాడ : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను తక్షణం విధుల్లో నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ .... రేపటి (26వ తేదీ) నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు దేశ వ్యాప్త ఆందోళనలకు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. శుక్రవారం విజయవాడలో వామపక్ష పార్టీల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ .... మిగతా ఇద్దరు కమిషనర్ల మాట వినకుండా పదే పదే సవరణలు చేస్తున్నా, పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ... రికార్డుల్లో వారి భిన్నాప్రాయాలను రాస్తూ ఉన్నా కూడా .. లెక్కచేయకుండా జ్క్షానేష్ కుమార్ ఏక పక్షంగా వ్యవహరించి సర్ ప్రక్రియను కొనసాగిస్తూ కంప్యూటర్ల ఆధారంగా దేశవ్యాప్తంగా ఆయన గుప్పెట్లో పెట్టుకొని 13 కోట్ల ఓటర్ల హక్కును తీసేయడం చాలా తీవ్రమైన విషయమన్నారు. భారత ప్రజాస్వామ్యానికే ఇది పెద్ద సవాలుగా మారిందన్నారు. అందుకని ఆయన పదవిలో ఉండటానికి అనర్హులని, తక్షణం ఆయన్ను విధుల్లో నుండి తప్పించాలని డిమాండ్ చేస్తూ రేపటి (26వ తేదీ) నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనను జయప్రదం చేయాలని కోరారు. జ్క్షానేష్ కుమార్ ను తప్పించేవరకు ఈ ఉద్యమం సాగిస్తామని.. ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని, అందరూ తోడ్పడాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలకు, స్వచ్ఛంద సంస్థలకు వామపక్ష పార్టీల తరపున విజ్క్షప్తి చేశారు.
LIVE : తక్షణం జ్క్షానేష్ కుమార్ ను విధుల్లో నుండి తప్పించాలి : వి.శ్రీనివాసరావు
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)