గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Live: ఢిల్లీలో నిరసనలపై స్పందించని ఏపీ ప్రధాన రాజకీయ పార్టీలు

1 గంట క్రితం

సీపీఎం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 01:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఢిల్లీలో నిరసనలపై సుప్రీం కోర్టు వ్యవహరించిన తీరు, రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించని తీరు సరైనవి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రవేటు సంస్థ అయిన జిఎంఆర్ చెందిన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వం ఎందుకు ముందుండి ఏర్పాట్లు చేస్తుందని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యాలు కల్పించకుండా, ప్రజా సంక్షేమం కోత పెడుతూ ప్రైవేటు సంస్థలకు సాయం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల హక్కులను కాపాడే చిత్తశుద్ధి ఉంటే అత్యంత నైపుణ్యం కలిగిన న్యాయమూర్తులను నియమించాలని, పర్యవేక్షణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా జీవో నెం.3ని కాపాడి 1/70 రద్దు కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్