గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రతిభ స్థానంలో నేరప్రవృత్తి చేరితే ఆ వ్యవస్థ కుళ్లిపోయినట్లే : కమల్‌హాసన్‌

2 గంటల క్రితం

kamal haasan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 12:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : ప్రతిభ స్థానంలో నేరప్రవృత్తి చేరితే ఆ వ్యవస్థ కుళ్లిపోయినట్లేనని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్ష‍ుడు, ఎంపి కమల్‌హాసన్‌ గురువారం పేర్కొన్నారు. ప్రస్తుత విద్యావిధానం, ఇటీవల పరీక్ష‍ల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలపై ఆయన కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యారంగ ప్రస్తుత పరిస్థితిని ఆయన కుళ్లిపోయిన స్థితిగా అభివర్ణించారు. విద్యార్థులను కేంద్రం విఫలం చేసిందని దుయ్యబట్టారు. ఒక బిడ్డ ఏడ్చినపుడు మనం వినాలని, కానీ బదులుగా పిల్లలు ఎంతో మంది చనిపోయే వరకు వేచి చూశామని అన్నారు. చదువు స్థానంలో కోచింగ్‌, ఉత్సుకత స్థానంలో ఆందోళన, ప్రతిభ స్థానంలో నేరప్రవృత్తి చోటుచేసుకోవడంతో వ్యవస్థ కుళ్లిపోయిందని ఎక్స్‌ పోస్ట్‌లో రాసుకొచ్చారు. విద్యార్థులకు సమాధానానికి బదులుగా బారికేడ్లు, లాఠీలు ఎదురైతే ఆ దేశవ్యవస్థ విఫలమైనట్లేనని దుయ్యబట్టారు. అలాగే పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ చేపడుతున్న నిరాహార దీక్ష‍ను నిలిపివేయాల్సిందిగా కమల్‌హాసన్ కోరారు. మీ సూచనలు విద్యార్థులకు అవసరమని అన్నారు. మీ బాధ్యతను నిర్వర్తించారు. ఇప్పుడు దేశం మీ పట్ల తన బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయ ఆసన్నమైందని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్