గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆందోళనకారులను డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తానంటూ పోలీసుల బెదిరింపులు

1 గంట క్రితం

mumbai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 04:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : నిరసనల్లో పాల్గొంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తానని ముంబయి పోలీసులు విద్యార్థులను బెదిరించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. సిజెపికి మద్దతుగా ముంబయిలోనూ కొందరు విద్యార్థులు నిరసన చేపట్టారు. అయితే వారిపై పోలీసులసు బెదిరింపులకు దిగారు. నిరసనల్లో మళ్లీ మీరు నాకు కనిపిస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తా. అప్పుడపు మీ జీవితం నాశనమవుతుంది. బెయిల్ కూడా రాదు. జైల్లోనే మగ్గిపోవాల్సి వుంటుంది. అని విద్యార్థులను ఉద్దేశించి ఒక పోలీస్ అధికారి చెబుతున్నట్లు వీడియోలో ఉంది. ముంబయి కాంగ్రెస్ ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. వీడియోపై నగర పోలీసులు దర్యాప్తుకు ఆదేశించారు. తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ పోలీసుని పోస్టింగ్‌ నుండి తప్పించినట్లు పోలీసులు తెలిపారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్