- సహకార సంఘంపై ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ భారీ నిరసన ప్రదర్శన
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో రైతులు కదంతొక్కారు. సహకార సంఘంపై ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ సోమవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. గోకుల్ డెయిరీ బోర్డులో మార్పులు చేయడాన్ని నిరసిస్తూ వేలాదిమంది పాల రైతులు తమ పశువులను తీసుకుని కొల్హాపూర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గోకుల్ డెయిరీగా అందరికీ చిరపరిచితమైన కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల యూనియన్ బోర్డులో 25మంది సభ్యులుంటారు. వారిలో పాలక మహాయుతి సంకీర్ణ సభ్యుల సంఖ్యను ప్రస్తుతమున్న 12 నుండి 16కి పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ అయింది. ఆ ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ రైతులు ప్రదర్శన చేపట్టారు. రూ.500కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన సహకార సంస్థలకు ఐదుగురు సభ్యులను నామినేట్ చేయడానికి ప్రభుత్వానికి ఈ ఆర్డినెన్స్ అనుమతినిస్తోంది.








కామెంట్‌లు (0)