సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - నగరపాలక సంస్థ ఎన్నికలు ముగియగానే నగరమంతటా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ముమ్మరం : సిహెచ్‌.బాబూరావు

28 నిమిషాల క్రితం

Video Ch Baburao CPM Press Meet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం



నగరపాలక సంస్థ ఎన్నికలు ముగియగానే నగరమంతటా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ముమ్మరం..
పాయికాపురం, శాంతినగర్ లో బెదిరించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న అదానీ సిబ్బంది. మీటర్ల బిగింపును అడ్డుకున్న స్థానికులు, సిపిఎం నేతలు.
వినియోగదారుల సంతకాలను ఫోర్జరీ చేసి మోసగిస్తున్న అదాని కంపెనీ
*ఫోర్జరీ సంతకాలు, బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వినియోగదారులు, సిపిఎం నేతలు.
ప్రజలకు అండగా నిలిచిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, తదితర నేతలు

⚡రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల పై మాట తప్పింది, ప్రజలను మోసగిస్తోంది
⚡ప్రతి పక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని పిలుపునిచ్చిన కూటమి నేతలు... నేడు మీటర్ల బిగింపుకు ఆదేశాలు ఇవ్వటం సిగ్గుచేటు
⚡స్మార్ట్ మీటర్ల వలన భవిష్యత్తులో ప్రజలపై అనేక రూపాల్లో భారాలు పడతాయి
⚡ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించిన వినియోగదారులకు కూడా అధికంగా బిల్లులు వస్తాయన్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు
⚡భవిష్యత్తులో ప్రీపెయిడ్ పద్ధతిలో ముందుగానే నగదు చెల్లించి విద్యుత్తు వినియోగించుకోవాలి, నగదు అయిపోగానే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది
⚡విద్యుత్ స్మార్ట్ మీటర్ వ్యయం పదివేల రూ... దశలవారీగా వినియోగదారుల నుండి వసూలు చేస్తారు
⚡ప్రతి గంటకు వినియోగాన్ని బట్టి విద్యుత్ టారిఫ్ నిర్ణయించే విధానాన్ని ఇప్పటికే కొన్ని కేటగిరీల వారికి ప్రవేశపెట్టారు, భవిష్యత్తులో గృహ వినియోగదారులకు కూడా పగలు కంటే రాత్రి అధికంగా విద్యుత్ బిల్లులు వసూలు చేయటానికి ప్రభుత్వం కుట్ర పన్నింది
⚡అదానీ సంస్థ ప్రయోజనాల కొరకు కేంద్ర మోడీ ప్రభుత్వ ఆదేశాలకు లొంగి గత ప్రభుత్వం మీటర్ల బిగింపుకు ఒప్పందం చేసుకున్నది, అధికారంలోకి రాగానే మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పి, టిడిపి కూటమి ప్రభుత్వ స్మార్ట్ మీటర్లను కొనసాగించడం మోసపూరితం
⚡ఇప్పటికే విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని ప్రజల ఆందోళన చెందుతూ ఉండగా, చార్జీలు తగ్గించకుండా, మళ్లీ స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై దీర్ఘకాలిక భారాలు వేయటం తగదు
⚡వాస్తవాలను మభ్యపరిచి, ప్రజలను భయభ్రాంతులను చేస్తూ అనైతిక, అక్రమ పద్ధతుల్లో మీటర్ల బిగింపుకు ప్రభుత్వం పూనుకోవటం శోచనీయం
⚡కూటమి ప్రజాప్రతినిధులు దీనికి బాధ్యత వహించాలి, వారు వెంటనే స్పందించాలి, స్మార్ట్ మీటర్ల బిగింపును వారే ఆపించాలి
⚡వినియోగదారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ, బెదిరిస్తూ, దౌర్జన్యాలకు పాల్పడుతున్న అదాని కంపెనీ కాంట్రాక్టర్లు, అధికారులపై పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలి
⚡విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం
⚡విజయవాడ నగరంలో ప్రజలు చైతన్యంగా ఉండి ఎక్కడికక్కడ స్మార్ట్ మీటర్ల బిగింపును అడ్డుకోవాలి, ప్రతిఘటించాలి, సిపిఎం వారికి అండగా నిలుస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్