సోమవారం, 23 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మార్కాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంపికపై ఉత్కంఠ !

12 నిమిషాల క్రితం

Suspense surrounds the selection of the Markapuram Municipal Vice Chairman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 12:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మార్కాపురం (ప్రకాశం) : మార్కాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై టీడీపీ, జనసేన వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి వైస్ చైర్మన్ పదవిని ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి కేటాయించాలనే సంప్రదాయం ఉందంటూ చర్చ జరుగుతోంది. టీడీపీ, జనసేనకు చెందిన ముస్లిం కౌన్సిలర్లలో ఒకరికి పదవి కేటాయించేలా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జనసేన ఇన్‌ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ మధ్య సయోధ్య కుదిరినట్లు ప్రచారం. అయితే చివరి నిమిషంలో జనసేనలోని ముస్లిం నేతల జోక్యంతో సమీకరణాలు మారాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ. 10వ వార్డు జనసేన కౌన్సిలర్ కొప్పుల నాగజ్యోతికి వైస్ చైర్మన్ పదవి కేటాయిస్తున్నట్లు పార్టీ కార్యాలయం నుంచి అధికారిక పత్రం విడుదలైనట్లు సమాచారం. మైనార్టీలకు పదవి దక్కుతుందని ఆశించిన వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. వైస్ చైర్మన్ ఎంపిక వ్యవహారంలో చివరి నిమిషంలో చోటుచేసుకున్న పరిణామాలతో టీడీపీ, జనసేన నేతల్లో అయోమయం నెలకొన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని గంటల్లో తేలనున్న వైస్ చైర్మన్ పీఠం ఎవరికి ? మైనార్టీ వర్గానికా.. జనసేన ప్రకటించిన అభ్యర్థికా ? మార్కాపురం రాజకీయాల్లో ఉత్కంఠ !


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్