మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిక్కిపోతున్న రూపాయి

1 గంట క్రితం

rupee.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 03:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పౌష్టికాహారం అందని పాపాయిలా

మన రూపాయి రోజు రోజుకి చిక్కిపోతోంది

అమెరికా డాలర్ కొట్టే దెబ్బలకు తట్టుకోలేక

అంతర్జాతీయ విపణి వీథులలో

భారత్ రూపాయి మౌనంగా రోదిస్తోంది..!

ఉడ్డోలగం ఎక్కిన పాలకులు

ఉత్పాదక రంగంపై వేశారు శీత కన్ను

ఎగమతులకు ఎగనామాలు పెట్టి

దిగుమతులు పైనే దృష్టి పెట్టారు

విదేశీ నిల్వలు రిజర్వులేక పోవటంతో

మన ఆర్థిక వాహనం రిజర్వులో పడింది

మన రూపాయికి దిమ్మ తిరిగి

బజారులో బేజారెత్తి పోతోంది..!

రూపాయి విలువ పడిపోవటంతో

నిత్యావసర వస్తువుల ధరలు

నిత్యం నింగి వైపు పయనిస్తున్నాయి

ధరలు తగ్గించమని ధర్నాలు చేస్తుంటే

ఇంధనాలు ధరలు పెరిగాయని

పాలకవర్గం చెప్పే కుంటి సాకులు..!

బొమ్మ బొరుసూ గురుతులు

చెరిగి పోతున్న మన రూపాయిని

రక్షించుకోక పోతే....

నిత్యావసర వస్తువుల ధరలు

నిత్యమూ పెరిగిపోతుంటాయి

మధ్య, సామాన్య తరగతుల

బతుకులు ఛిద్రమైపోతాయి...!?

ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతుంది..??

- జి.సూర్య,

సెల్‌: 6281725659

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్