అల్లూరి ప్రజా పితూరి
అల్లూరి జనులకు దారి
తెల్లవాడిపై ఎత్తిన జెండా
అల్లూరి అగ్ని ప్రచండా
అందుకో మా నివాళి
విప్లవ జ్యోతి అల్లూరి
భారతాన్ని బ్రిటీషోడు ఏలినాడు వందల ఏళ్లు
దొరల పాలన ప్రజలకు బందీఖానా సంకెళ్లు
తూరుపుకనుమలో ఉదయించాడు
తిరుగుబాటు పోరాట నినాదం
స్వరాజ్యం స్థాపనకు ఎగిసిన ఓ నిప్పు కణం
అందుకో మా నివాళి
విప్లవ జ్యోతి అల్లూరి
తల్లి అడవిపై తెల్ల దొరల ఆగడాలను చూసి
ఆదివాసుల జీవితాలు ఛిద్రమైన బ్రతుకులు చూసి చైతన్యం రంగరించి ఆదివాసుల ఒక్కటి చేసి
విల్లు ఎక్కు పెట్టి నాడు మన్య పితూరి నడినాడు
అందుకో మా నివాళి
విప్లవ జ్యోతి అల్లూరి
ఆదివాసుల జీవనం అడవిపై హక్కు
అటవీ ఫలసాయాలు ఆదివాసీల సొత్తు
రామరాజు త్యాగ ఫలం
మరిచి పోదు నేటి తరం
అడవి తల్లి రక్షణకై హక్కుల అమలుకై
అల్లూరి వారసులై సాగిస్తాం పోరాటం
అందుకో మా నివాళి
విప్లవ జ్యోతి అల్లూరి.
- పొద్దు బాలదేవ్
ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి.







కామెంట్‌లు (0)