ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

10 నెలల్లో 14 అభ్యంతరాలు

29 సెప్టెంబర్, 2026

14 objections in 10 months
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:43 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

మొదటి అభ్యంతరం 2025 అక్టోబర్‌ 28న సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ నమోదు చేసినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సంఘం పూర్తి కమిషన్‌ ఆమోదం లేకుండానే ఈసీఐ పేరుతో కొన్ని ఉత్తరాలు, ఆదేశాలు జారీ అవుతున్నాయన్నది ఆయన అభ్యంతరంగా పేర్కొన్నారు. కమిషన్‌ పేరుతో వెలువడే అధికారిక సమాచారానికి అవసరమైన ఆమోద ప్రక్రియ పాటించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.


ఏప్రిల్‌ 16, 2026.. ఒకే రోజున నాలుగు అభ్యంతరాలు

​

సంధూ, జోషి నుంచి కలిపి నాలుగు అభ్యంతరాలు నమోదయ్యాయి.కొత్త ఐటీ మాడ్యూల్స్‌, పోర్టల్స్‌కు సంబంధించిన సమాచారం తనకు అధికారికంగా కాకుండా మీడియా ద్వారా తెలిసిందని సంధూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే అధికారిక సమాచారాలు బయటకు వెళ్తున్నాయన్న అంశాన్ని కూడా అదే రోజు ఆయన లేవనెత్తారు.

​అదే రోజు వివేక్‌ జోషి కూడా ఎన్నికల సంఘం సమావేశాలకు సంబంధించిన అజెండాలు, మినిట్స్‌ సమయానికి అందడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే అధికారుల విదేశీ పర్యటనలకు సంబంధించి కమిషన్‌ ఆమోద ప్రక్రియపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నాలుగు అభ్యంతరాలు ఒకే రోజు నమోదు కావడం అంతర్గత విభేదాల తీవ్రతపై దృష్టిని ఆకర్షించింది.


​ఏప్రిల్‌ 24.. అధికారిక సమాచారంపై మరోసారి ప్రశ్న


ఏప్రిల్‌ 24న వివేక్‌ జోషి మరోసారి కమిషన్‌ ఆమోదం లేకుండా అధికారిక సమాచారాన్ని పంపడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషన్‌ పేరుతో వెలువడే ప్రతి అధికారిక సమాచారానికి అవసరమైన ఆమోదం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఎనిమిది రోజుల క్రితం ఇదే అంశంపై సంధూ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది.

మే 16.. ఫామ్‌–6 మార్పుపై జోషి అభ్యంతరం


​మే 16న వివేక్‌ జోషి ఫామ్‌–6 మార్పుపై కీలక అభ్యంతరం నమోదు చేశారు. కొత్త ఓటరు నమోదు కోసం ఉపయోగించే చట్టబద్ధమైన ఫామ్‌–6ను నిబంధనల్లో మార్పు చేయకుండా ఈ విధంగా మార్చడం సరైన ప్రక్రియ కాదని ఆయన పేర్కొన్నారు.

​మే 19న సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ కూడా ఫామ్‌–6 మార్పుపై జోషి అభిప్రాయాన్ని సమర్థిస్తూ రికార్డులో తన అభిప్రాయం నమోదు చేశారు. దీంతో కొత్త ఓటర్లకు సంబంధించిన చట్టబద్ధమైన ఫామ్‌లో మార్పు విషయంలో ముగ్గురు సభ్యులున్న కమిషన్‌లో ఇద్దరు కమిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది.

మే 29.. ఓటర్ల డేటాబేస్‌ కేంద్రీకరణపై జోషి అభ్యంతరం


​మే 29న జోషి మరో కీలక అంశాన్ని లేవనెత్తారు. ఓటర్ల డేటాబేస్‌ క్రమంగా కేంద్రీకృతమవుతోందని ఆయన పేర్కొంటూ, డేటాబేస్‌లో మార్పులు చేయడానికి చట్టబద్ధమైన అధికారులకే అనుమతి ఉందని నిర్ధారించే విధంగా ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు.

​ఓటర్ల జాబితా నిర్వహణలో నియోజకవర్గ స్థాయిలోని ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌ఓ)కు ఉన్న చట్టబద్ధమైన పాత్రకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

​జూలై 13.. డేటాబేస్‌ యాక్సెస్‌పై సంధూ

​

డేటాబేస్‌ నిర్వహణపై జోషి లేవనెత్తిన ఆందోళనకు కొనసాగింపుగా జూలై 13న సంధూ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఎన్నికల అధికారులు ఓటర్ల డేటాబేస్‌కు పూర్తి స్థాయి యాక్సెస్‌ పొందలేకపోతున్నారన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. చట్టబద్ధమైన అధికారులకు తమ విధులు నిర్వహించేందుకు అవసరమైన సిస్టమ్‌ యాక్సెస్‌ను పరిమితం చేసే అధికారం ఐటీ విభాగంలోని అధికారులకు ఉందా అనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

​జూలై 29.. పని విభజనపై ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలు


​జూలై 29న వివేక్‌ జోషి, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ వేర్వేరుగా కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి లేఖలు రాశారు. ఎన్నికల ఓటర్ల జాబితా నిర్వహణకు సంబంధించిన ఐటీ వ్యవస్థపై పర్యవేక్షణను ప్రభావితం చేసే విధంగా పని విభజనలో మార్పులు జరిగాయని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.తమకు సమాచారం ఇవ్వకుండానే పని బాధ్యతల్లో మార్పులు చేశారని ఇద్దరూ పేర్కొన్నారు. ఈ అంశం ఎన్నికల సంఘం అంతర్గత స్థాయిని దాటి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పరిపాలనా స్థాయికి చేరింది.

​జూలై 30.. కొత్త పని విభజన ఉత్తర్వును ఇద్దరూ వ్యతిరేకించారు

​

జూలై 30న జోషి, సంధూ ఇద్దరూ కలిసి కొత్త పని విభజనకు సంబంధించిన ఉత్తర్వును వ్యతిరేకించారు. తమకు తెలియకుండా చేసిన పని కేటాయింపులను వారు అంగీకరించలేదని రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ అంశం తర్వాత ఇద్దరు కమిషనర్లు కేబినెట్‌ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన వ్యవహారంతో కూడా ముడిపడింది.

ఆగస్టు 12.. పశ్చిమ బెంగాల్‌ అప్పీళ్లకు అనుమతి ఎవరిచ్చారు?





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్