సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకుదిపేయనున్న ఎల్ నినో ?

1 గంట క్రితం

EL NINO – El Niño has started again.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 04:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కీలక రంగాలపై ఆందోళన

  • సన్నద్ధం చాలదంటున్న అధికారులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఎల్‌‌నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా పడే అవకాశం ఉందన్న ఆందోళన అధికార యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. అదే జరిగితే తాగునీరు, వ్యవసాయం, విద్యుత్, మత్స్య రంగం, పరిశ్రమలు, ఉద్యానవనం, పశుగ్రాసం వంటి రంగాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీంతో ఈ అంశంపై దృష్టి సారించి ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. అయితే, వక్తమవుతున్న ఆందోళలకు అనుగుణంగా సన్నద్ద చర్యలు కనిపించడం లేదన్న అనుమానాలు అధికారులే వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌‌నినో ప్రభావంపై ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించగా కొద్దిరోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. చీఫ్ సెక్రటరీ సమీక్షించగా, తాజాగా ముఖ్యమంత్రి కూడా సోమవారం అధికారులతో చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 143 మిల్లీమీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా కేవలం 37 ఎంఎం మాత్రమే వర్షం కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో నదుల్లో నీరు తగ్గిపోవడమే కీలక సమస్యగా మారుతుందని అధికారులు అంటున్నారు. దీంతో తాగునీటికి ప్రధాన సమస్య ఏర్పడుతుందని, ఇదే సమయంలో పరిశ్రమలకు నీరు అందించేందుకు, విద్యుత్ సరఫరా చేసేందుకు కూడా ఇబ్బందికరంగా మారుతుందని, దానివల్ల పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కూడా పడుతుందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిశ్రమలకు అనేక ప్రాంతాల్లో రిజర్వాయర్లు కాలువలు వంటి వనరుల ద్వారా నీటిని పెద్ద మొత్తంలో సమకూరుస్తున్నారు అదేవిధంగా జల విద్యుత్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు . ప్రస్తుతం నదుల్లో నీరు లేకపోవడం, వల్ల విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయాలు నెలకొనే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే సాధారణ ప్రజలకు సరఫరా చేసే విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయాలు నెలకొంటాయని, ఈ నేపథ్యంలోనే పరిశ్రమలకు కూడా విద్యుత్‌‌ సరఫరాను తగ్గించే పరిస్థితి ఉంటుందని అంటున్నారు.

మత్స్యశాఖపై అధిక ప్రభావం

వ్యవసాయరంగానికి సంబంధించి రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో సింహభాగం మత్స్య శాఖదే. ఐతే తాజా పరిస్థితుల కారణంగా ఆక్వా, మత్స్యరంగంపై ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చెరువుల్లో నీటి మట్టం, నీటి నాణ్యత, కరిగిన ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు అంటున్నారు. ఆక్వా రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధంగా జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం సూచిస్తోంది.

​వ్యవసాయంపైనా ...

నీటి సరఫరా తగ్గిపోవడం వల్ల వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యానవన పంటలు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని చెబుతున్నారు. ఇటు వర్షాలు లేక అటు భూగర్భ జలాలు అడుగంటుతే వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్య పరిశ్రమ వంటి వాటిపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

బ్లాక్‌ ‌మార్కెట్‌‌కు బియ్యం..

తాజా పరిణామాల మధ్య బియ్యంపై ఆందోళన పెరుగుతోంది. ఇప్పటికే కొంతమంది బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించినట్టు సమాచారం. ఈ కారణంగా బియ్యం ధరలు కూడా కిలోకు 10 రూపాయల వరకు పెరిగాయి. ఇక ప్రజల దైనందిక ఆహార అవసరాల్లో భాగమైన కాయగూరలు, ఆకుకూరలు వంటి వాటిపై మాత్రం ఎక్కువ ప్రభావం తక్షణమే ఉండే ప్రమాదం ఉందని చెప్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్