అనంతపురం అనే ఊరిలో రవి అనే బాలుడు ఉన్నాడు. ఒక రోజు తనకు చాలా ఆకలి వేసింది. దూరంగా బాగా ఎత్తైన అల్ల నేరేడు చెట్టు కనిపించింది. చెట్టు దగ్గరకు వెళ్లి దాని మీద ఉన్న అల్ల నేరేడు పండ్లను చూసాడు. అవి అందుకోవడానికి ఎగిరి, ఎగిరి ప్రయత్నించాడు. కాని అవి చాలా ఎత్తులో ఉండడంతో రవికి అందలేదు. రవి అలసిపోయి అక్కడే చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడికి ఒక కోతి వచ్చింది. అది చెట్టు ఎక్కి కొమ్మలు ఊపింది. కొన్ని పండ్లు రాలి క్రింద పడ్డాయి. రవి సంతోషంతో ఆ పండ్లను తీసుకుని తిన్నాడు. వాటితో తన ఆకలి తీరింది. కోతికి ధన్యవాదాలు చెప్పి ఆ రోజు రవి ఇంటికి వెళ్ళాడు. ఆ తరువాత కూడా నేరేడు పండ్లను తినాలన్న ప్రతి సారి చెట్టు దగ్గరికి వెళ్లేవాడు. రవి రాగానే కోతి కొమ్మలు ఊపి పండ్లను ఇచ్చేది. చాలా త్వరగా రవి, కోతి మంచి స్నేహితులు అయ్యారు.
- కాటపాక రక్షిత్,
7వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
అనంత సాగర్, సిద్దిపేట జిల్లా.






కామెంట్‌లు (0)