ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకుటుంబాలు బలి

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 03:36 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఆర్థిక సమస్యలతో పెరుగుతున్న ఆత్మహత్యలు

  • తెలుగు రాష్ర్టాల్లో వరుస ఘటనలు

​ఒక కుటుంబం... తండ్రి, తల్లి, ఇద్దరు పిల్లలు. ! జీవితంలో కష్టాలు సహజమే! కానీ ఆ కష్టాలు ఒకదానిపై మరొకటి పేరుకుపోతే? ఆదాయం సరిపోక అప్పు చేయాలి. అప్పు తీర్చడానికి మరో అప్పు చేయాలి. పిల్లల చదువుల ఖర్చు పెరుగుతుంది. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఆసుపత్రి బిల్లు మరో భారం అవుతుంది. ఉద్యోగం పోతే ఆదాయం ఆగిపోతుంది. వ్యాపారం నష్టపోతే అప్పు పెరుగుతుంది. చివరికి కుటుంబం ముందున్న సమస్యలను పరిష్కరించుకునే మార్గాలు మూసుకుపోవడం, అవమానాలను భరించడం కంటే ప్రాణాలు తీసుకుని సమస్యల నుంచి తప్పించుకోవడమే మార్గమని భావన పెరుగుతోందా...? కొంత కాలంగా తెలుగు రాష్ట్ర్రాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఈ ప్రశ్నకు కారణం.


  • 2025 జూలై 17. తిరుపతి జిల్లా పాకాల మండలంలోని పెద్ద హరిజనవాడ. తండ్రి గిరి, తల్లి హేమలత, కుమార్తెలు తేజశ్రీ, తనుశ్రీ,ఒకేసారి బావిలోకి దూకేశారు. ఈ ఘటనలో అక్కడి కక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణం ఆర్థిక ఇబ్బందులే!

  • 2026 జూన్‌ 15 నెల్లూరు జిల్లా, సంగం మండలం దువ్వూరు గ్రామం ‌రిటైర్డ్‌ ఉపాధ్యా యుడు మధుసూదన్‌ (65), భార్య రత్నావళి (56), కుమారుడు సాయి సమ్రాట్‌ (26) ఆత్మహత్య చేసుకున్నారు. ఇంజినీరింగ్‌ చదివిన కుమారుడికి స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, కుటుంబ భవిష్యత్తుపై ఆందోళన ఈ సంఘటనకు కారణం.

  • బిర్యానీ వ్యాపారం కోసం తీసుకున్న సుమారు రూ.57 లక్షలు అప్పు తీర్చలేక హైదరాబాద్‌‌ అంబర్‌‌పేటలో ముగ్గురు సభ్యుల కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ తరహా విషాద సంఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తల్లి తండ్రులు తమ ప్రాణాలు బలవంతంగా తీసుకోవడంతో పాటు, అభం, శుభం తెలియని పసిపిల్లల ప్రాణాలను కూడా బలిగొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌‌లో ఈ తరహా సంఘటనలు ఆగస్టు నెలలో శుక్రవారం వరకు రెండు చోటుచేసుకోగా, శనివారం మరో కుటుంబం అదేబాట పట్టింది.

ఏమిటి కారణాలు?

పెరుగుతున్న అప్పులు, ఆదాయ అస్థిరత, ఉద్యోగం లేకపోవడం, వ్యాపార నష్టాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువుల భారాలు కుటుంబాల ఊపిరి తీస్తున్నట్లు అధ్యయనాలు తేలుస్తున్నాయి. పెరుగుతున్న వినిమయ సంస్కృతి కూడా దీనికి కారణం. ప్రభుత్వ బడులు, ఆస్పత్రులకు ఉరితాళ్లు వేసే విధానాలను పాలకులు అనుసరిస్తుండటంతో కార్పొరేట్‌ ‌విద్య, వైద్యం వైపు చూడక తప్పని స్థితి ఏర్పడుతోంది. ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీలు, కోచింగ్, ప్రొఫెషనల్ కోర్సులు గుదిబండలుగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖకు చెందిన నేషనల్‌ ‌శ్యాంపిల్‌ ‌సర్వే (ఎన్‌ఎస్ఎస్‌)‌ప్రకారం మన రాష్ట్రంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పాఠశాల విద్య చదువుతున్న ఒక్క విద్యార్థిపై సంవత్సరానికి సగటు ఖర్చు రూ.18,479 ఖర్చు అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.14,850గానూ,. పట్టణ ప్రాంతాల్లో రూ.26,078 గాను ఉంది. ప్రాథమిక స్థాయిలో రూ.14,850, మాధ్యమిక స్థాయిలో రూ.19,782, సెకండరీ స్థాయిలో రూ.24,685, హయ్యర్ సెకండరీ స్థాయిలో రూ.24,775గా ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ ‌తేల్చింది. దీనికి పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం, రవాణా వంటివి అదనం! వైద్యం విషయంలోనూ పరిస్థితి అంత తేలికగా లేదు. ఎన్‌ఎస్ఎస్‌ ‌తాజా సర్వే ప్రకారం ఒక కుటుంబంలో తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే ఆ కుటుంబం పరిస్థితి పూర్తిగా మారుతోంది.దేశవ్యాప్తంగా ఆసుపత్రిలో చేరిన ఒక్క కేసుకు కు సగటున రూ.34,064 ఖర్చు అవుతున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ ‌పేర్కొంది. మన రాష్ట్రంలో ఈ ఖర్చు ఇంకా ఎక్కువ! ఆసుపత్రి ఖర్చుతో పాటు మందులు, పరీక్షలు, ప్రయాణం, సహాయకుల ఖర్చు, పని మానేయడం వల్ల వచ్చే ఆదాయ నష్టం ఇవ్వన్నీ కలిసి కుటుంబాలను గుల్ల చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న రుణానికి కొత్త రుణం జత అయితే నెలవారీ ఆదాయంలో పెద్ద భాగం వాయిదాలు, వడ్డీలకే సరిపోయి ఊపిరి ఆడని స్థితిలోకి కుటుంబ పెద్దలను నెట్టివేస్తోంది. అప్పు వసూళ్లకోసం చోటుచేసుకునే వేధింపులతో పరిస్థితి ఘోరంగా మారుతోంది.

అల్పాదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం

అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న వారిలో అల్పాదాయ వర్గాల వారే అధికరం. నేషనల్‌ క్రైం రికార్డు బ్యూరో గణాంకాల

ప్రకారం రాష్ట్రంలో 2024లో నమోదైన 8,302 ఆత్మహత్యల్లో 4,149 మంది వార్షిక ఆదాయం రూ.1 లక్షలోపు వర్గానికి చెందినవారు. మరో 3,177 మంది ఒకటి నుండి ఐదు లక్షల రూపాయల ఆదాయం సంపాదించేవారు. అంటే ఆత్మహత్యలు చేసుకున్న వారిలో సుమారు 89 శాతం మంది రూ.5 లక్షలలోపు వార్షిక ఆదాయం సంపాదించేవారే!

table

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్