ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరోజూ మనం ఆహారంలో ఫైబర్ ఎంత తీసుకోవాలి?

1 గంట క్రితం

High-Fiber-Foods-Page.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 04:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆహారంలో ఫైబర్ చాలా కీలకం. మనం రోజూ తీసుకునే ఆహారంలో సుమారు 25 నుంచి 38 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. కానీ చాలామంది శరీరానికి సరిపడా ఫైబర్ తీసుకోవడం లేదు. సగటున 15 గ్రాముల వరకు మాత్రమే తీసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

  • ​ఫైబర్ ఫుడ్స్‌ను ఆహారంలో క్రమంగా చేర్చుకోవాలి. ఫైబర్స్‌లో రెండు రకాలుంటాయి. ఒకటి కరిగే ఫైబర్స్, రెండు కరగని ఫైబర్స్. కరిగే ఫైబర్స్ పండ్లు, చిక్కుళ్లు, ఓట్స్‌లో లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మందగింపజేస్తాయి. కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉపయోగకరంగా ఉంటాయి. కరగని ఫైబర్స్ కూరగాయ ముక్కలు, తొక్కలు, గోధుమ తవుడు వంటి వాటిల్లో లభిస్తాయి. ఈ తవుడును కొంతమంది చపాతీలు, రొట్టెల పిండిలో కలిపి తీసుకుంటారు. ఇవి మలబద్ధకం సమస్యను తగ్గిస్తాయి. అయితే అధిక మొత్తంలో ఫైబర్ తీసుకుంటే జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. అందుకే ఫైబర్‌ను కొద్దికొద్దిగా తగిన మోతాదులో తీసుకోవాలి. ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవాలనుకుంటే కొన్నిరోజులు 10 నుంచి 15 గ్రాములతో ప్రారంభించి, ఆ తర్వాత 20-25 గ్రాములకు పెంచుకోవాలి. ఇలా క్రమంగా ఆహారంలో మార్పులు చేసుకుంటూ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునేటప్పుడు తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. ఫైబర్ పేగుల్లో నీటిని గ్రహిస్తుంది. తగినంత నీరు తీసుకోకపోతే కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్