సామాన్యులకే కాదు. ప్రముఖలకు కూడా ఎన్నికల కమిషన్ ‘సర్’ ప్రక్రియలో భాగంగా నోటీసులు పంపింది. అలా నోటీసులు అందుకున్న వారిలో కొందరి వివరాలు
జగదీప్ ధన్‌ఖర్ : మాజీ ఉప రాష్ట్రపతి. ఆయనకు కూడా సర్ నోటీసు అందింది. 2002 నాటి ఓటర్ల జాబితాతో ఆయన పేరు సరిపోలడం లేదంటూ ఎన్నికల కమిషన్ నోటీస్ జారీ చేసింది.
కపిల్ సిబల్ : సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ. ఆయన, ఆయన భార్య ప్రమీల "గత SIR తో అన్‌మ్యాప్డ్" కేటగిరీలో నోటీసు అందుకున్నారు. దీనిపై సిబల్ ఎన్నికల కమిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మనీష్ సిసోడియా : మాజీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి. డేటా మిస్‌మ్యాచ్ కారణంగా ఆయనకు, ఆయన కుటుంబానికి నోటీసులు అందాయి.
లాల్ కృష్ణ అద్వానీ : మాజీ ఉప ప్రధాని. 98 ఏళ్ల అద్వానీ పేరు 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాప్ కాకపోవడంతో నోటీసు అందింది. ఆయన కుమార్తె ప్రతిభ, కోడలు గీతికలకు కూడా నోటీసులు అందాయి.
ఎస్. జైశంకర్ : విదేశాంగ మంత్రి. ఆయన, ఆయన భార్య క్యోకో జైశంకర్ "గత SIR తో అన్‌మ్యాప్డ్" కేటగిరీలో ఉన్నారు. వీరు న్యూఢిల్లీ నియోజకవర్గంలోని సుందర్ బాగ్ ఓటరు పార్ట్‌లో నమోదై ఉన్నారు.
రేఖా గుప్తా : ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి. ఆమెకు కూడా SIR నోటీసు అందింది.
అరవింద్ కేజ్రీవాల్ : మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత. ఆయనకు నోటీసు జారీ అయింది.
ప్రవీణ్ సూద్ : CBI డైరెక్టర్. ఆయన, ఆయన భార్య వనిత సూద్, తల్లి కమలేష్ సూద్ "గత SIR తో అన్‌మ్యాప్డ్" కేటగిరీలో నోటీసు అందుకున్నారు.
జనరల్ ఉపేంద్ర ద్వివేది : మాజీ ఆర్మీ చీఫ్. ఆయన, ఆయన భార్య సునీత ద్వివేది కూడా అన్‌మ్యాప్డ్ కేటగిరీలో నోటీసు అందుకున్నారు.
బన్సూరి స్వరాజ్ : న్యూఢిల్లీ బీజేపీ ఎంపీ. ఆమెకు కూడా నోటీసు అందింది.
ఎస్.ఎస్. సంధు : ఎన్నికల కమిషనర్. ప్రముఖుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది.








కామెంట్‌లు (0)