బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఖరీఫ్‌‌లో తగ్గిన బియ్యం ఉత్పత్తి.. 20 లక్షల టన్నులు

13 నిమిషాల క్రితం

RICE-EXPO-13-5-2024.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 12:28 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ఎల్‌‌నినో, వరుస తుపాన్ల ఫలితం

  • ధరలపై ప్రభావం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : ఎల్‌‌నినో ప్రభావిత కరువు, వరుస తుపాన్ల దాడితో ఖరీఫ్‌‌లో సుమారు 28 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి తగ్గుతుందని ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది. బియ్యంగా చూసుకుంటే 20 లక్షల టన్నుల వరకు ఉత్పత్తి తగ్గనుంది. గతేడాది ఖరీఫ్‌, రబీ సీజన్లలో దిగుబడులు ఆశాజనకంగా ఉండగానే బహిరంగ మార్కెట్‌‌లో వినియోగదారులకు ఇప్పటికే బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. భారీగా ఉత్పత్తి తగ్గిన పక్షంలో బియ్యం ధరలు ఇంకా ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వ, మార్కెట్‌ ‌వర్గాలు తెలుపుతున్నాయి. 2025-26 ఖరీఫ్‌‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణాన్ని ప్రభుత్వం 38.87 లక్షల ఎకరాలుగా పేర్కొనగా అంతకంటే ఎక్కువ 43.37 లక్షల ఎకరాల్లో సాగైందని, 94.92 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని అర్థగణాంక శాఖ తన తుది అంచనాల్లో వెల్లడించింది. ఎకరానికి 2,188 కిలోల వడ్ల దిగుబడి లభించిందని తెలిపింది. రైత్వారీగా సగటున 28 బస్తాల (బస్తా 76 కిలోల వంతున) ధాన్యం వచ్చింది. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌‌నకు మొదటి ముందస్తు అంచనాగా సెప్టెంబర్‌ నాల్గవ వారంలో 33.20 లక్షల ఎకరాల్లో వరి సేద్యం జరుగుతుందని, 66.76 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి లభిస్తుందని సర్కార్‌ వెల్లడించింది. ఎల్‌‌నినో కరువు తిష్ట, ప్రాజెక్టులలో నీటి లభ్యత తగినంత లేనందున వరి సాగుపై ప్రభుత్వ ఆంక్షలు, నీటి సరఫరాకు తీవ్ర వత్తిళ్లు, భూగర్భ జలాలు లోతులను చూడటం... వంటి పరిస్థితుల నేపథ్యంలో నిరుడు తుది అంచనాల కంటే ఈ ఏడాది పది లక్షల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని, 28 లక్షల టన్నుల దాన్యం దిగుబడులను తగ్గించింది. ఎకరాకు ఉత్పాదకతను సైతం 2,188 కిలోల నుంచి 2,010 కిలోలకు కదించింది. రైత్వారీగా చూస్తే గతేడాది కంటే ఎకరానికి రెండు బస్తాల వరకు ధాన్యం దిగుబడి తగ్గుతుందని పేర్కొంది. ఈ అంచనాలు తీవ్ర వాయుగుండం, అర్నబ్‌, మురసు తుపాన్ల కంటే ముందు వేసినవి. ఎల్‌‌నినో కష్టాలను దాటుకొని రైతులు ఆంక్షల మధ్య చేసిన సాగు ద్వారా కాస్తో కూస్తో పంట చేతికొచ్చే సమయానికి వరుస తుపాన్లు విరుచుకుపడటంతో అపార నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటల్లో వరి విస్తీర్ణమే అత్యధికం. దాంతో ధాన్యం దిగుబడులు ఇంకా త గ్గుతాయన్న ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి.

11 లక్షల టన్నుల తగ్గుదల

అర్నబ్‌, మురసు తుపాన్ల వలన ఆరున్నర లక్షల ఎకరాల్లోని వరి పంట 33 శాతానికి పైగా దెబ్బతిందని ప్రభుత్వం అంచనా వేసింది. అర్నబ్‌ ‌విలయానికి 5.22 లక్షల ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పంట దెబ్బతింది. తుపాన్‌ వలన వీచిన పెను గాలులకు వరి కంకులు నీటిలో వాలిపోయాయి. వారం రోజులకు పైన నీటిలో మునిగి ఉన్నాయి. పోయినదిపోగా మిగిలినదానిలోనూ చేతికొచ్చేది చాలా తక్కువంటున్నారు. ప్రభుత్వం 9 లక్షల టన్నుల దిగుబడి నష్టంగా కేంద్రానికి నివేదిక పంపింది. మురసు తుపాన్‌‌కు లక్షన్నర ఎకరాల్లో వరి దెబ్బతిందని, ఉత్పత్తి నష్టం రెండున్నర లక్షల టన్నులని సర్కార్‌ ‌ప్రకటించింది. తుపాన్ల వలన కలిగిన నష్టంతోపాటు కరువు నష్టం ఉండనే ఉంది. ఈ ఏట ఖరీఫ్‌‌లో వరి సాగు లక్షన్నర ఎకరాల్లో తగ్గింది. సాధారణ సాగు 37.85 లక్షల ఎకరాలు కాగా 36.35 లక్షల ఎకరాల్లో సాగైంది.

ప్రస్తుత ధరలు వ్యాపార మాయాజాలమే

ఎల్‌‌నినో వార్తలతో మూడు నెలల నుంచి మార్కెట్‌ ‌వర్గాలు అమాంతం బియ్యం ధరలను పెంచేశాయి. ఈ ధరలకు ఉత్పత్తితో సంబంధం లేదు. నిరుడు ఖరీఫ్‌‌లో ప్రతికూల పరిస్థితులు ఉన్నా అంచనాలకు మించి సాగు, దిగుబడులు లభిం చాయి. ఆ నిల్వలే అందుబాటులో ఉన్నాయి. ఎల్‌‌నినో భయాలను తమ లాభార్జనకు ఉపయోగ పెట్టుకుంటున్న మార్కెట్‌ ‌శక్తులు బియ్యం ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశాయని, నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అర్థమవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్