నేడు ఇండియా-ఎ × శ్రీలంక-ఎ
సెమీఫైనల్ కీలక పోరు
ఎసిసి ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ
దోహా: ఎసిసి ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ క్రికెట్‌టోర్నీలో భారత్-ఎ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. గ్రూప్-బిలో 2వ స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరిన భారతజట్టు.. గురువారం జరిగిన తొలి సెమీస్‌లో శ్రీలంకతో తలపడనుంది. గ్రూప్ దశలో నేపాల్, యుఎఇలపై ఘన విజయం సాధించిన తిలక్ వర్మ సారథ్యంలోని భారతజట్టు... పాకిస్తాన్-ఎతో జరిగిన గ్రూప్ లీగ్‌లో అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యుఎఇపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యుఎఇ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా-ఎ కేవలం 14.2 ఓవర్లలోనే ఛేదించింది. క్రికెట్ చరిత్రలో ఇది ఒక రికార్డు కాగా.. ఆ మ్యాచ్‌లో 15ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లోనే 204 పరుగులు కొట్టి పలు రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగే సెమీస్ మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు శ్రీలంక-ఎ జట్టు గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ గ్రూప్‌లో ఉన్న బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లపై ఘన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌పై 6వికెట్ల తేడాతో గెలిచిన శ్రీలంక.. రెండో లీగ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 24 పరుగుల తేడాతో ఓడించింది. మూడో, చివరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్ టాపర్‌గా ముగించింది. శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.
జట్లు(అంచనా)...
ఇండియా-ఎ : తిలక్ వర్మ(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రింకు సింగ్, కుమార్ కుషగ్ర, సుయాన్స్ షెడ్జే, షాబాజ్ అహ్మద్, హర్స్ దూబే, హర్షిత్ రాణా, ఆర్షాద్ ఖాన్.
శ్రీలంక-ఎ : రత్నాయకే(కెప్టెన్), క్రూస్‌పుల్లే, జయవర్ధనే, మధుష్కా, ధనుంజయ, లియనాగే, సహాన్, లాహిరు, రవీందు ఫెర్నాండో, సముధితా, విజయకాంత్.







కామెంట్‌లు (0)