- 99 ఏళ్ల పాటు కారుచౌకగా లీజు?
- 5.50 ఎకరాల ప్రభుత్వ ఆస్తి విలువ రూ.200 కోట్లు
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో
అత్యంత ఖరీదైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా 'లీజు`కు ఇవ్వడం టిడిపి కూటమి ప్రభుత్వానికి రివాజుగా మారింది. మొన్నటికి మొన్న టూరిజం హోటల్ ను ఏడాదికి రూ.కోటి లెక్కన 33 ఏళ్ల పాటు 'మృగవాని` రిసార్ట్ కు అప్పన్నంగా అప్పగింది. తాజాగా తిరుపతి-కరకంబాడి రోడ్డులోని ప్రభుత్వ పరిశ్రమ అయిన ‘ది రూరల్ ఎంటర్ప్రెన్యూల్ డెవలప్‌మెంట్ సొసైటీ’ (ట్రెండ్స్, మంగళం ప్రాజెక్టు)ని 'లీలా గ్రూప్ హోటల్స్`కు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘ట్రెండ్స్’ను కలెక్టర్, పలువురు అధికారులు ఇప్పటికే పలుమార్లు పరిశీలన చేశారు. ఈ నెల 13న టూరిజం శాఖ తిరుపతి డైరెక్టర్ రమణప్రసాద్, టూరిజం జిల్లా అధికారి జనార్ధనరెడ్డి, ఆర్‌డిఒ రామ్మోహన్, లీలా గ్రూప్ హోటల్స్ ప్రతినిధులు పరిశీలించారు. ఐదున్నర ఎకరాల ఈ ప్రభుత్వ ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.200 కోట్లు పైమాటే. 99 ఏళ్ల పాటు నామమాత్రపు ధరకు లీజుకు ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే లీలా గ్రూప్ హోటల్స్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం.
ఇదీ ‘ట్రెండ్స్’ ప్రస్థానం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలోనే తలమానికంగా ‘ట్రెండ్స్’ ఓ వెలుగు వెలిగింది. దీనిని 1984 సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి.రామారావు ప్రారంభించారు. అప్పట్లో 150 మంది కార్మికులతో ఇది ప్రారంభమైంది. ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన బీరువాలు, బల్లలు, కుర్చీలు, పేపర్ వర్క్, ప్రింటింగ్ వర్క్ అప్పట్లో ఇక్కడ తయారయ్యేవి. ట్రెండ్స్ లో ఉత్పత్తి అయిన బిస్కెట్లను తిరుమల యాత్రికులకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో విక్రయించేవారు. ఎంతోమందికి నైపుణ్యం పెంచుతూ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌గా విరాజిల్లింది. నాణ్యమైన ఉత్పత్తులతో ఆ సంస్థ ప్రభుత్వ, ప్రజల విశ్వాసాన్ని చూరగొంది. కలెక్టర్ వినియోగించే కారుకు సైతం నమ్మకంతో ఇక్కడే వాటర్ వాష్ చేయించేవారు. అలాంటి సంస్థను 2014లో నష్టాల పేరుతో అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ హయాంలో మూసివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఇక్కడి కార్మికులు చెబుతున్నారు.
ఇప్పటికీ కార్మికులకు గ్రాట్యూటీ బకాయిలు
‘ట్రెండ్స్’ ప్రాజెక్టు మూసివేత సమయంలో గ్రాట్యూటీ, 18 నెలల వేతనాలు బకాయి ఉన్నాయని, వాటిని నేటికీ చెల్లించలేదని కార్మికులు తెలిపారు. 2014 తర్వాత ఎంతో విలువైన మిషనరీలను, వివిధ రకాల యూనిట్ భవనాలను, స్థలాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు వాచ్ మెన్స్ లను ప్రభుత్వం నియమించింది. వారు కొన్ని సంవత్సరాల పాటు అక్కడ విధులు నిర్వహించినా వేతనాలు చెల్లించకపోవడంతో







కామెంట్‌లు (0)