ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫారం-6లో ఏం మార్చారు ?

29 సెప్టెంబర్, 2026

What has been changed in Form-6?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​

​ఈ ఏడాది జూలైలో ఈసీఐకి చెందిన ఇసిఐనెట్‌ పోర్టల్‌లోని ఆన్‌లైన్‌ ఫామ్–6లో కొత్తగా ఒక డిక్లరేషన్‌ విభాగాన్ని చేర్చారు. ఇది ఫామ్‌లోని ‘జే’ మరియు ‘కే’ భాగాల మధ్య చేర్చబడింది. ఇందులో దరఖాస్తుదారు మూడు అంశాల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.గతంలో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో తన పేరు ఉందా, తన తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల పేరు ఉందా, లేక తనకు గానీ తల్లిదండ్రులకు గానీ ఆ జాబితాలో పేరు లేదని పేర్కొనాలా అన్నది కొత్తగా అడిగారు.తన పేరు లేదా తల్లిదండ్రులు, తాతముత్తాతల పేరు ఉన్నట్లు పేర్కొంటే.. సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్‌ బూత్‌, సీరియల్‌ నంబర్‌ వంటి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విభాగాన్ని ఫామ్‌లో తప్పనిసరి అని ప్రత్యేకంగా పేర్కొనకపోయినా.. ఆన్‌లైన్‌లో దానిని పూర్తి చేయకుండా దరఖాస్తును ముందుకు తీసుకెళ్లే అవకాశం లేకుండా ఉందని నివేదికలు పేర్కొన్నాయి.


మే 16న తొలి అభ్యంతరం

​ఈ మార్పుపై ఎన్నికల కమిషనర్‌ వివేక్‌ జోషి మే 16న ఫైల్‌పై తన అభ్యంతరాన్ని నమోదు చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణను ప్రాతినిధ్య ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 21(3) కింద ప్రత్యేక చర్యగా చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

​అయితే ఫామ్‌–6, ఫామ్‌–8 వంటి ఫామ్‌లు సాధారణ ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన చట్టబద్ధమైన ఫామ్‌లని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవి 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల కింద నిర్దేశించబడినందున.. వాటిలో మార్పులు చేయాలంటే ముందుగా ఆ నిబంధనల్లోనే సవరణ చేయాల్సి ఉంటుందని జోషి పేర్కొన్నారు.

మే 19న


సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ కూడా ..

​

జోషి అభ్యంతరం వ్యక్తం చేసిన మూడు రోజులకే, మే 19న మరో ఎన్నికల కమిషనర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ కూడా అదే అభిప్రాయాన్ని ఫైల్‌పై నమోదు చేశారు.అంటే ముగ్గురు సభ్యులున్న ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు ఫామ్‌–6ను ప్రత్యేక సవరణ ప్రక్రియ ద్వారా మార్చడం సరైన విధానం కాదని రికార్డులో అభిప్రాయం వ్యక్తం చేసినట్టయింది.

​

అభ్యంతరాలు బేఖాతరు

​ఈ అభ్యంతరాలు నమోదైన తర్వాత కూడా జూలై 12న ఈసీఐనెట్‌ పోర్టల్‌లో కొత్త డిక్లరేషన్‌ కనిపించింది. అంటే మే నెలలో ఇద్దరు కమిషనర్లు నమోదు చేసిన అభిప్రాయాల తర్వాత కూడా ఆన్‌లైన్‌ ఫామ్‌లో మార్పు అమల్లోకి వచ్చింది.దీనిపైనే అంతర్గతంగా మరోసారి అభ్యంతరం వ్యక్తమైంది.


ఆగస్టు 13న సంధూ మళ్లీ అభ్యంతరం

​ఆగస్టు 13న సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు. మే నెలలో ఇద్దరు కమిషనర్లు నమోదు చేసిన అభిప్రాయాల నేపథ్యంలోనూ మార్పు తొలగించబడలేదని ఆయన పేర్కొన్నారు. ఫామ్‌లో చేసిన మార్పును ఆయన “అనధికారికం”, “చట్టవిరుద్ధం”గా అభివర్ణిస్తూ వెంటనే తొలగించాలని కోరారు. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటరుగా నమోదు కావాలనుకునే వారికి అనవసరమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈ పదాలు సంధూ స్వయంగా నమోదు చేసిన అభ్యంతరాల్లోనివే. ​​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్