పాక్‌పై ఘన విజయం
ఎడ్జ్‌బాస్టన్: టీ20 ప్రపంచ కప్ 2026లో తన తొలి మ్యాచ్‌లోనే భారత మహిళా క్రికెట్ జట్టు అధరహో అనిపించింది. ఆదివారం రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌ల్లో పూర్తి సాధికారత ప్రదర్శించిన భారత్ పాకిస్తాన్‌ను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్మృతి మంధాన (68; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36; 35 బంతుల్లో) రాణించారు. చివర్లో రిచా ఘోష్ (34; 17 బంతుల్లో) దూకుడుగా ఆడడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. ఈ తరువాత లక్ష్యఛేదనకు పాకిస్థాన్ దీప్తి శర్మ (5/10) స్పిన్ మాయాజాలానికి 106 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఓపెనర్ మునీబా అలీ (41; 35 బంతుల్లో 5 ఫోర్లు) టాప్ స్కోరర్. గుల్ ఫెరోజా 12, అయేషా జాఫర్ 12, అలియా రియాజ్ 12 పరుగులు చేశారు. శ్రీ చరణి 3, షెఫాలి వర్మ ఒక వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్‌లోనూ 12 పరుగులతో రాణించిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ ( 6) త్వరగా నిష్క్రమించింది. ఈ తరువాత వచ్చిన రోడ్రిగ్జ్ (1) కూడా నిరాశపర్చింది. ఈ దశలో ఓపెనర్ స్మృతి మంధానకు జత కలిసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జోడీ దాటిగా ఆడింది. నాలుగు వికెట్‌కు కీలకమైన 91 పరుగులు జోడించింది. తరువాత మంధాన నాలుగో వికెట్‌గా వెనుతిరిగినా రిచా ఘోష్ దాటికి భారత్ స్కోరు 150 దాటింది. భారత్ ఇన్నింగ్స్ ముగిసేసరికి దీప్తి శర్మ- శ్రియింకా పాటిల్ జోడి అజేయంగా నిలిచారు.









కామెంట్‌లు (0)