ఒకే వేదిక ఖరారుపై సర్వత్రా విమర్శలు
బిసిసిఐ తీరుపై మాజీ క్రికెటర్ల ధ్వజం
ముంబయి: ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌తో మూడు టి20ల సిరీస్ ఆడేందుకు సెప్టెంబర్‌లో బయల్దేరి రానుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) వేదికలను బుధవారం ప్రకటించింది. ఆఫ్ఘన్‌తో జరిగే మూడు టి20లను ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నట్లు వెల్లడించింది. దీంతో ఒకే వేదికపై మూడు టి20లు నిర్వహించడం సరికాదని మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఇలా ఒకే వేదికపై నిర్వహిస్తే ఇతర రాష్ట్రాలకు ఆర్ధిక ఎలా చేకూరుతుందని వారు పెదవి విరుస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో, న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో ఆఫ్ఘన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారతజట్టు ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ తేడాతో అతిపెద్ద విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘన్‌తో మూడు టి20లు సెప్టెంబర్ 13, 15, 17న అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి.








కామెంట్‌లు (0)